గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ వేత్తలు భారత రాజకీయ సంప్రదాయాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. భారతదేశ సాంప్రదాయ రాజకీయాలు మారవని, సంతులిత అభివృద్దే ధ్యేయంగా నడుచుకునే రాజకీయాలకు మేము దూరమని ప్రతి ఏడాది నిరుపిస్తునే వస్తున్నారు. మన సాంప్రదాయ రాజకీయ వేత్తలు. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే రైల్వే బడ్జెట్. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తామంటూనే చాలా రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపించి, తమ సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ కు మాత్రం కొత్త రైళ్లను పరుగులు పెట్టించారు.


అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మాత్రం ఈ రైల్వే బడ్జెట్ సమ న్యాయం పాటించలేదని పైగా రైల్వే చార్జీలను పెంచి సామాన్యుడిపై గుదిబండ మోపారని యూపీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. మరి ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. యూపీఏ తరహాలోనే బీజేపీ కూడా ప్రవర్తించనుందా.. లేక మేమూ సంప్రదాయ రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోమని నిరుపించనుందా... అధికారంలో ఉన్న పార్టీలను విమర్శించే ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చాక తాము ఇంతకుముందు మాట్లాడిన మాటలను, చేసిన విమర్శలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన ఆవసరం ఎంతైనా ఉందంటున్న వ్యాసమిది.


తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్ లో పెద్దపీట వేయాలని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. దక్షిణ మధ్య రైల్వేకు రూ.2500కోట్ల మేర పనులు మంజూరు చేయాలని కోరారు. మణుగూరు-రామగుండం మార్గానికి రూ.100 కోట్లు, అక్కన్న పేట-మెదక్ కు 40కోట్లు, భద్రాచలం-కొవ్వూరుకు రూ.100కోట్లు, నడికుడి –శ్రీకాళహస్తి మార్గానికి రూ.309 కోట్లు కేటాయించాలని కోరారు. సికింద్రాబాద్-కాజీపేట, హైదరాబాద్-మహబూబ్ నగర్-కర్నూలు, హైదరాబాద్-బీబీనగర్-నడికుడి విద్యుదీకరణ పనులు చేపట్టాలనన్నారు. కాజిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ నుండు ఢిల్లీ కి బుల్లెట్ రైళ్లు వేయాలని కోరారు. ఎంయెన్టీఎస్ ఫేజ్-2 సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని, రానున్న బడ్జెట్లో దీనికి రూ.200కోట్లు కేటాయించాలన్నారు. హైదరాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్-నల్గొండ మధ్య ఇంటర్ సిటీ రైళ్లు వేయాలని కోరారు. సికింద్రాబాద్-గోవా సూపర్ ఫాస్ట్ రైలు నడపాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్-బికనీర్ ఎక్స్ ప్రెస్ ను రోజూ నడపాలని కోరారు.


రాష్ట్రాల అభివృద్ధికి రవాణా వ్యవస్థ అనుసంధానం అత్యవసరం. పైగా తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా కొత్త పనుల అమలుకు నోచుకోక తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పర్వాలేదు కాని తెలంగాణలో రైలు కుతకు నోచుకోని ప్రదేశాలెన్నో... మరి వాటన్నింటి పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన ఆవసరం అత్యవసరం. సాంప్రదాయ రాజకీయాలను పక్కనపెట్టి కొత్త తరం రాజకీయాలకు తెరలేపాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది.


కేంద్ర ప్రభుత్వం తరుపున తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న దత్తన్న మొరను కేంద్ర రైల్వే మంత్రి ఆలకించేనా లేక మేమూ సంప్రదాయవాదులమే అని నిరూపించుకోవడానికి సద్ధమౌతుందో తెలియాలంటే ఫిబ్రవరి చివరి వారం దాకా ఆగాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: