చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిథ్యం కల్పించడానికి రూపొందించిన 33శాతం రిజర్వేషన్ బిల్లు ప్రస్తుత పెండింగ్ లో ఉంది. ఢిల్లీ వేదికపై మహిళా ప్రజాప్రనిధుల మొట్టమొదటి జాతీయ సదస్సులో ప్రణబ్ ప్రారంభోపన్యాసం, ఇందులో చట్ట సభల్లో సమాధిక ప్రాధాన్యం లేనిదే మహిళా సాధికారత ఎలా సాకారమవుతుందన్న ప్రథమ పౌరుడి సుతి ప్రశ్న. నూటికి నూరుపాళ్లు అర్థవంతమైనది. దేశ ఓటర్లలో 49 సతతం మహిళలే అయినప్పటికీ వారి సామర్థ్యాన్ని పూర్తిగా వెలికి రాకుండా పితృస్వామ్య వ్యవస్థ, సామాజిక్ ఆకట్టుబాట్లు అడ్డుకుంటాయని ప్రణబ్ తాజాగా తప్పు బట్టారు.


ఆ జాబితాలో సంకుచిత రాజకీయాలు చేచాల్సి ఉందన్నది చేదు నిజం. దాన్ని నర్మగర్భంగా ధ్వనిపజేస్తూ లోక్ సభలో, రాష్ట్ర శాసనసభల్లో మహ్లాలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తిరిగి పట్టాలకు ఎక్కించడంలో తమ నిబద్ధత నిరూపించుకోవాలని పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు.


అవకాశం కూడివస్తే సంబ్రమాశ్చర్యపరచగల సత్తా మహిళల్లో ప్రదర్శితం అవుతున్నా, వారికి పార్టీలు ఆనవాయితీగా మొండి చెయ్యి చూపుతున్నాయి. ఆరు ప్రధాన రాజకీయ పక్షాలు కేవలం తొమ్మిది శాతం మహిళలకే టికెట్లు ఇవ్వగా, గత సార్వత్రిక బరిలోకి దూకిన మొత్తం 636 మంది స్త్రీలలో 30శాతం స్వతంత్ర అభ్యర్థులుగా లెక్క తేలారు. ఆకాశంలో సగానికి అవకాశాల పరికల్పనలో లోటు చేసేదే లేదంటున్న పార్టీలు, ఎండమావి ఏకాభిప్రాయ సాధనపై ప్రకటనలతో పొద్దు పుచ్చడాన్ని జాతి జనులు ఏళ్ల తరబడి పరికిస్తున్నారు.


యూపీఏ జామానాలో ఆరేళ్ల క్రితం ఎగువసభ ఆమోదం పొందే బిల్లు, దిగువసభ లో ముందడుగు వెయ్యలేకపోయింది. రాజ్య సభలో ప్రవేశపెట్టినందువల్ల సాంకేతికంగా మురిగిపోయే ముప్పులేని ఆ బిల్లును లోక్ సభా ఆమోదించాక, 50శాతం విధాన సభలు సమ్మతి తెలపాల్సి ఉంటుంది.


దేశ అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థలో మహిళా సహ్క్తికి విశేష ప్రాముఖ్యం కల్పిస్తున్న ఘనత తూర్పు ఆఫ్రికాలోని రువాండాది. అక్కడి దిగువ సభలోని 80 స్థానాలు మహిళలకు కేటాయించినవే. వివిధ జాతీయ పార్లమెంట్లలో సగటున 22.7శాతం మేర స్త్రీలకు ప్రాతినిథ్యం దక్కుతోంది. దేశీయంగా ఇప్పటి దాకా ప్రస్తుత పదహారో లోక్ సభ లోనే గరిష్టంగా 12 శాతం మేర మహిళా పార్లమెంటీరియన్లు లెక్క తేలారు. పర్యావసానంగా,193 దేశాల జాబితాలో 109 వ స్థానాన ఇండియా ఈసురుమంటోంది.


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు మాటలు, తీర్నామాలు కాదు చేతలే పార్టీల సహజ స్వభావాలను కళ్లకు కడతాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఉభయ అభాల్లో మహిళా ఎంపీల కే మాట్లాడే అవకాశం ఇవ్వాలని మునాళ్ళ క్రితం ప్రధాని మోడీ ప్రతిపాదించారు.మూడో వంతు కోటా బిల్లును సక్రమంగా పట్టాలకు ఎక్కించడం లోనూ అదే తరహా సృజనాత్మక అభినివేశం ప్రదర్శితమైతే, స్త్రీలోకం సహర్షంగా స్వాగతిస్తుంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: