చెన్నైలో కొలంబియా అంతర్జాతీయ చిత్రోత్సవాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రోత్సవాల్లో కొలంబియా చిత్రాలు ఛేజింగ్ ఫైర్స్, ద మష్రూమ్స్,దిట్రోప్,సిక్రెట్ ఆఫ్ ది జంగిల్, షోబియా అండ్ ద అకార్డియన్స్ వాలేజ్ తో పాటు పలు చిత్రాలను ప్రదర్శించనున్నారు.

ఇక ఈ చిత్రోత్సవాలలో రష్యా సాంస్కృతిక కేంద్రం వేదిక కానుంది. ఈ కార్యక్రమాలు ఢిల్లీలోని కొలంబియా దౌత్య కార్యాలయం, చెన్నై ఇండో సినీ అప్రిసియేషన్ సంస్థలు కలిసి నిర్వహించబోతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇక ప్రారంభ వేడుకలో ఇరు దేశ ప్రముఖులు, దౌత్యాధికారులు పాల్గొనబోతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: