ఈ మద్య కాలంలో ఏ విషయాన్నైనా సోషల్ మీడియా ద్వారా ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. ముఖ్యంగా గుగుల్  లాంటి సామాజిక మాద్యమాల ద్వారా ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం.  అయితే అప్పుడప్పుడు ఈ సామాజిక మాద్యమాల ద్వారా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుంటాయి. తాజాగా సామాజిక మాధ్యమం వికీపీడియాపై లోక్ సభలో దుమారం రేగింది. వికీపీడియా చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ బీజేపీ మహిళా ఎంపీ అంజుబాల ఆరోపించారు. తాను మరణించినట్లుగా రాసిన వికీ పీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మార్చి మూడవ తేదీన తాను చనిపోయినట్లుగా వికీపీడియా తప్పుడు సమాచారం ఇస్తోందని భారతీయ జనతా పార్టీ ఎంపీ అంజుబాల ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఈ విషయమై తన కార్యదర్శికి ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. దీని పైన పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే తనకు సిగ్గుగా ఉందన్నారు.   దీనికి స్పందించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా మంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ... ఒక ఎంపీకి సంబంధించి వికీపీడియాలో తప్పుడు సమాచారం అందించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తప్పవని చెప్పారు. సంబంధితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎంపీ అన్నారు.మరి.. సదానంద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: