ప్రజాస్వామ్యంలో మూడు ప్రధాన వ్యవస్థలు ఉంటాయి. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. వీటిలో ప్రతి ఒక్కదానికి మరో వ్యవస్థపై అదుపు చేసేలా రాజ్యాంగం ఎన్నో సౌకర్యాలు కల్పించింది. దీన్నే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. ఈ మూడు వ్యవస్థల్లో ఒక దాని గౌరవం మరొకటి కాపాడుతూ ఉంటాయి. ఘర్షణ వైఖరి లేకుండా జాగ్రత్త పడతాయి.

వీటికి తోడు నాలుగో స్థంభంలా మరో వ్యవస్థ ఉంది అదే జర్నలిజం. దీన్ని ప్రజా స్వామ్యానికి నాలుగో స్తంభం అంటాం. చంద్రబాబు సర్కారుపై అవిశ్వాసం పెట్టిన సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సభలో భూకంపం సృష్టించాయి. చంద్రబాబుపైనా ఎన్నో కేసులు ఉన్నాయని.. ఆయన వాటిని మేనేజే చేసుకున్నారని జగన్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. 

ఇది కచ్చితంగా శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థకు మచ్చ తీసుకురావడమే అంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ అసెంబ్లీకే మచ్చ తెచ్చాడని తీవ్రంగా విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే నేరుగా జడ్డిలను విమర్శించడమేనని.. జగన్ తన అవినీతిని అందరికీ అంటిస్తున్నాడని సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. 

ఈ సమయంలో మాట్లాడిన బీజేపీ నేతలు, స్వతంత్ర్య అభ్యర్థులు కూడా జగన్ అన్ని వ్యవస్థలపై బురద జల్లుతున్నారని ఇది మంచిది కాదని సూచించారు. ఈ సమయంలో జగన్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. చంద్రబాబు లాయర్లను కూడా మేనేజ్ చేస్తారని గంటకు లక్ష రూపాయలు తీసుకుని వాదించే హరీశ్ సాల్వే వంటి వారు ఆయన తరపునే వాదిస్తారని తమకు వాదించరని అన్నారు. 

జగన్ చివరకు న్యాయవాదులనూ వదలడం లేదని మరోసారి యనమల విమర్శించారు. జగన్ అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చారని టీడీపీ సభ్యులు అంటే.. అలాంటిదేమీ లేదని జగన్ చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: