విజయ మాల్య తన 28 వ యేళ్ళ వయసులో (1983) తండ్రి మరణానంతరం పూర్తిగా వ్యాపార సామ్రాజ్యంలోకి ప్రవేశించి వాయు వేగంతో వ్యాపారాన్ని విస్తృతం చేస్తూ ఇప్పుడు 60 వ్యాపార సంస్థలు జాతీయ-అంతర్జాతీయంగా ప్రారంభించి కొనసాగిస్తున్నారు. అనేక చిన్న చిన్న కంపనీలను, విఫల మైన సిక్ కంపనీలను తన కంపనీలో నిమజ్జనం చేసుకుంటూ వ్యాపార పరిమాణాన్ని మరియు లాభాలను వృద్ది చేస్తూ విస్తరణ దిశలో పయనించాడు. 


తండ్రి నిర్వహించిన యునైట్ద్ స్పిరిట్స్ (దేశంలోనే అతి పెద్ద మద్యం తయారీ దారు) లెదా యుబి గ్రూప్ కి చైర్మన్ గా ఉంటూ దాన్ని అనూహ్యమైన వేగంతో వృద్దిపరిచారు. దాదాపు 20 రకాల బీర్ బ్రాండ్లతో దేశంలోనే కాకుండా, దేశం వెలుపల 52 దేశాలకు విస్తరించిన ఈ వ్యాపార, పారిశ్రామిక సార్వభౌముడు ప్రపంచంలోనె 3వ అతి పెద్ద మద్యం తయారీ సంస్థ గా యు.బి ని తీర్చిదిద్దాడు. ఇక్కడ ఆయన పట్టుదల, కృషి, అంకితభావం, ఆకాంక్ష ఎనలేనివి. తమ కుటుంబ మద్య వ్యాపారం తో పాటు అనేకరంగాలకు విస్తరించాడు వాటిలో ముఖ్యమైనవి:  


1.రియల్ ఎస్టేట్     2. ఫెర్టిలైజర్     3. విమానయానం.


ఆయన మొత్తం వ్యాపారం 15 సంవత్సరాలకు 64% సగటు టర్నోవర్ అభివృద్దితో 1998-99 సంవత్సరానికి కల్లా 11 బిలియన్ అమెరికన్ డాలర్ల టర్నోవర్ సాధించారు. ఆయన వ్యాపారాన్ని వృద్దిచేసిన తీరు బాంకులను, ఇతర ఆర్ధిక సంస్థలనే ఆశ్చర్యపరచింది. పోటీదారులు అసూయ కలిగేలాగా వ్యాపారాన్ని అనేక లేయర్ లతో, దశల్లో దిశానిర్దేశం చేస్తూ నడిపించిన తీరు గర్హనీయం.
నూతన వ్యాపారాలను కైవశం చేసుకునే ప్రణాళికల్లో భాగంగా :


1. Berger పెయింట్స్


2. పబ్లికేషన్ రంగానికి చెందిన ది ఏసియన్ ఏజ్, సినీ బ్లిట్జ్ (బాలీవుడ్ సినీ పత్రిక)


3. బెస్ట్ క్రోంప్టన్


4. మాంగళురు కెమికల్స్ & ఫెర్టిలిజెర్స్ లాంటి కంపనీలను కైవశంచేసుకున్నారు.

కింగ్ ఫిషర్ ఫార్ములా రేస్


విజయమాల్య చైర్మాన్ గా వచ్చిన తరవాత తమ కుటుంబ ప్రాధమిక వ్యాపారమైన యునైటెడ్ స్పిరిట్స్ ప్రత్యేక బ్రాండ్ అయిన కింగ్-ఫిషర్ బీరు 50% మార్కెట్ను కొల్లగొట్టి ప్రపంచంలోనే మధ్యం వ్యాపార పరిమాణంలో రెండవ స్థానాన్ని అతి సునాయాసంగా కైవసం చేసుకొంది. ఆ చరిత్రాత్మక వ్యాపార విక్రయ పరిమాణం 10 కోట్ల బీరు కేసులన్న మాట.  2012 సంవత్సరంలో ప్రపంచ బెవెరేజెస్ దిగ్గజ సంస్థ అయిన DIAGEO కు తన యునైటెడ్ స్పిరిట్స్ యాజమాన్య హక్కులను దారాదత్తం చేశాడు. అతి తక్కువ వాటాలను మాత్రమే తను ఉంచుకోవటం జరిగింది. దాంతో 2015 లో DIAGEO సంస్థ మాల్యా ను చైర్మాన్ పదవినుండి బలవంతంగా తప్పించింది. నష్టపరిహారంగా 75 మిల్లియన్ అమెరికన్ డాలర్లను ఈ డీల్ లో భాగంగా ఇచ్చారు. కాని ఈ పేమెంట్ ను భారతీయ కోర్ట్లు బ్లాక్  చేశాయి.

అత్యంత ప్రమాదాలు వేగంలోను, అనుభవంలేమి తోనూ, అసమర్ధుల సాహచర్యంలోను, అసమర్ధ, తప్పుడు సలహాలతోను జరుగుతాయనే విషయాన్ని విజయమాల్య నుండి ప్రతి భారతీయ వ్యాపారుడు నేర్చుకోవలసిన విషయం.


2005 వ సంవత్సరంలో మాల్యా ప్రారంభించిన కింగ్-ఫిషర్-ఏయిర్లైన్ నిర్వాహణ అసమర్ధత వలన 2013 వరకే క్రమంగా దివాలా తీసింది. 2013 నుండి 15 నెలల కాలం ఉద్యోగులకు జీత భత్యములు యివ్వలెని పరిస్థితి బయటకువచ్చింది. నిర్వహణకు చెందిన పర్మిట్లను నియంత్రణ సంస్థలు రద్దుచేయటంతో నవంబర్ 2015 లో కింగ్-ఫిషెర్ ఏఇర్-లైన్స్ ను మూసివేయటం జరిగింది. దీనివలన బాంకు ఖాతాల్లో 9000 కొట్ల రూపాయలు నిరర్ధక ఆస్తులుగా పోగై వచ్చిచేరాయి.వీటితో పాటు ప్రభుత్వానికి రకరకాల టాక్సులు, ఇతర అనేకమంది ఋణ ధాతలకు పెద్దమొత్తంలో ఈ ఏఇర్-లైన్స్ సంస్థ బాకీ పడింది.


కింగ్-ఫిషర్ పతనం ఫలితంగా భారతీయ చట్టాల ప్రకారం విజయమాల్యా విల్-ఫుల్ డిఫాల్టర్ గా నిందితుడుగా మిగిలిపోయి దొంగతనంగా దేశం దాటి పలాయనం చిత్తగించారు. మనీ లాండరింగ్, ప్రజా సంపడను మోసపూరితంగా, ఫ్రాడుగా మ్రింగివేసిన కేసులో కూడా నిందితుడుగా మాల్యా మిగిలిపోయారు.


2016, మార్చ్ నెలలో బాంకుల కన్సార్టియం సుప్రీం కోర్ట్ తలుపుతట్టి విజయ్ మాల్యాను దేశం దాటి పోకుండా ఆయన పాస్పోర్ట్ ను సీజ్ చెయ్యాలని కోరాయి. ఇది ఊహించిన మాల్యా చక్కగా దేశం నుండే ఉడాయించినట్లు వార్తలు వచ్చాయి.


మార్చ్ 13 న హైదరాబాద్ కోర్ట్ మాల్యా పై నాన్-బెయిలబుల్ వారంట్ విడుదల చేసింది అది మాల్యా అరెస్టుకోసం ఉద్దేసించిన వారంట్. కాని భారత్ నుండి మాయమైన మాల్యా లండన్ లోని పరిసరాల్లో ఉన్న తన స్వంత ఫాం-హౌజ్ "లెడి-వాక్" లో ఉంటున్నట్లు అభిజ్ఞవర్గాల కధనం.


పాలిటిక్స్ లో విజయ్ మాల్య



రాజకీయ జీవితం: గతం లో అఖిల భారత జనతాదళ్ సభ్యుడైన విజయమాల్య సుబ్రమన్య స్వామి నేతృత్వంలోని జనతాదళ్ లో 2003 లో చేరి దాని నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన సేవలందించారు.
2002 లో కాంగ్రెస్ పార్టి, సెక్యులర్ జనతాదళ్ సహకారంతో తన స్వంత రాష్ట్రమైన కర్నాటక నుండి స్వతంత్ర అభ్యర్దిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2010 లో మరల భారతీయ జనతా పార్టి,సెక్యులర్ జనతదళ్ సహకారంతో రి-ఎలెక్ట్ అయ్యారు రాజ్యసభకు. ఇప్పటికీ ఆయన రాజ్యసభ సభ్యుడే.  విజయమాల్యా జాతీయ అంతర్జాతీయంగా అనేక అవార్డులు రివార్డులు పొందారు.


టిప్పు సుల్తాన్ కత్తితో విజయ్ మాల్య


విదేశాలకు తరలివెళ్ళిన గొప్ప మహనీయుల వస్తువులను, జాతి సంపదను విదేశాలలో వేలంలో గెలిచి వాటిని భారత్ కు తిరిగి తెచ్చిన ఘనత కూదా ఆయన కుంది. అలాంటి వాటిల్లో చెప్పుకో తగినది “టిప్పు-సుల్తాన్-ఖడ్గం” ను లండన్ లో వేలం ద్వారా GBP 175000/- కు గెలిచి తెచ్చారు. ఇతర ముఖ్యమైన 30 వస్తువులను కూడా తిరిగి భారత్ కు తిరిగి తెచ్చారు. అలాగే న్యూయార్క్ నుండి మహాత్మా గాంధి వస్తువులను $ 1.8 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టి ఇండియా కు తిరిగి తెచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: