శాంతిదూత పోప్ ఫ్రాన్సిస్ మ‌న‌వ‌తావాధిగా మ‌రోసారి చాటి చెప్పారు. ఈస్ట‌ర్ వేడుక‌ల్లో భాగంగా పోప్ ఫ్రావిన్స్ 11 మంది శ‌ర‌ణార్థుల పాదాల‌ను క‌డిగారు. రోమ్ స‌మీపంలో ఉన్న క్యాజిల్నువో ది పోర్తోలోని ఓ శ‌ర‌ణార్థ క్యాంపులో ఆయ‌న  ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. శ‌రణార్థుల్లో న‌లుగురు  నైజీరియా క్యాథ‌లిక్కులు, ఎరిత్రియా మ‌హిళ, ఓ ఇట‌లీ వ‌ర్క‌ర్, మాలి, పాకిస్థాన్, సిరియా కు చెందిన ముగ్గురు ముస్లింల‌తో పాటు భార‌త్ కు చెందిన ఓ హిందూ ఉన్నారు. 79 ఏళ్ల పోప్ పాదాలు క‌డుగుతుంటే శ‌ర‌ణార్థులు కంట త‌డిపెట్టారు. 
 
శ‌ర‌ణార్థుల కాళ్ల‌ను నీటితో క‌డిగిన త‌రువాత ట‌వ‌ల్ తో శుభ్రం చేశారు. ఆ త‌రువాత అంద‌రి పాదాల‌ను ఆయ‌న ముద్దాడారు. ఈ సంద‌ర్భంగా ఫోప్ మాట్లాడుతూ.. మ‌నం అంద‌రం అన్నా ద‌మ్ముళ్ల లాంటి వాళ్లం, అంద‌ర‌మూ శాంతి వాతావ‌ర‌ణంలో జీవించాల‌నుకుంటున్న‌ట్లు తెలిపారు. శ‌ర‌ణార్ధుల శ్రేయ‌స్సు కోసం  యూరోప్ దేశాలు ముందుకు రావాల‌ని ఆయ‌న కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: