తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం మ‌రోసారి రాజ‌కీయ వేడి సంత‌రించుకుంది. అంటే అదేదో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లు కాదులేండీ. ప‌రోక్షంగా ఎనుకునే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు. ఇప్పుడు అందరు రాజకీయ నేత‌లు అటువైపే ఎదురుచూస్తున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు వ్యవ‌హారం పూర్తిగా ఆయా పార్టీలే తుది నిర్ణయంగా ఉండ‌టంతో... నాయకులు టికెట్ల కోసం పార్టీలో పోటీ పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ లో అధికారంలో ఉంటూ కనీసం ప్ర‌తిప‌క్ష పార్టీ కనీసం అర్హ‌త‌లేని తెలంగాణ‌లో సైతం రాజ్య‌స‌భ సీట్ల కోసం భారీగా పోటీ ఉంది.  అయితే అధినేత‌, ఏపీ  ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడుకు త‌ల నొప్పిగా మారింద‌నే చెప్పాలి. మొత్తం 3 స్థానాలు ద‌క్క‌నున్న క్ర‌మంలో 1 బీజేపీ కి ఇవ్వ‌డం దాదాపుగా ఖాయ‌మైపోయింది. మిగిలిన ఆ రెండు సీట్ల కోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నుంచి భారీ పోటీ పెరిగింది.


అందులో ఒక‌టి తాజా కేంద్ర మంత్ర సుజానా చౌద‌రికి పొడిగింపు ఇవ్వాలా? వ‌ద్దా అన్న చ‌ర్చ కూడా ఉంది. జాతీయ పార్టీ గా మారిన త‌రువాత తెలంగాణ నేత‌ల్లోనూ ఆశ‌లు చిగురించాయి. 
ఇక‌పోతే ఎలాగు తెలంగాణ నాయ‌కుల‌కు ఏపీలో కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌దవులు ఇస్తూ వ‌స్తున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఇదే క్ర‌మంలో రాజ్య‌స‌భ సీటు కూడా ఇస్తార‌న్న ఆశ మొద‌ల‌య్యింది.


కార్పొరేషన్ చైర్మ‌న్లు ఇచ్చి రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌క‌పోతే, తెలంగాణ నేత‌లు రాజ్య‌స‌భ సీటుకు ప‌నికిరారా? అలాంట‌ప్పుడు ఇక జాతీయ పార్టీకి అర్ధం మేమి ఉంటుంద‌న్న భావ‌న నేత‌ల్లో ఏర్ప‌డితే... పార్టీ నాయ‌కత్వానికి అదొక ఇబ్బందిగా మారుతుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో చంద్ర‌బాబు తీరుతో పార్టీ పూర్తిగా అడుగంటుకు పోయింది. పార్టీనే నమ్ముకుని పోటీ చేసిన నేత‌లు ఘోరంగా ఒడిపోయి... పార్టీ ఉండ‌లా వ‌ద్దా అన్న సందిగ్దంలో ప‌డిపోయారు. ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే వారి వారి రాజ‌కీయ స్వార్ధంతో అధికార పార్టీలోకి జంప్ ఆయ్యారు. పార్టీలో దాదాపుగా ఓడిపోయి ఖాళీగా ఉన్న నేత‌లే ఎక్కువ‌గా ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో పార్టీ అధినేత తెలంగాణ నాయ‌కుల‌కు సీట్ల‌ను ఇచ్చి పార్టీకి కొంతవ‌ర‌కు ఊపిరి పోయాలి. తెలంగాణ‌లో పార్టీ బ‌తికి బ‌ట్ట క‌ట్టాలంటే సీనియ‌ర్ నేత‌కు రాజ్య‌స‌భ సీటు ఇవ్వాల‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.


సీనియ‌ర్ నేత‌లు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు, ఉమా మాధ‌వ‌రెడ్డి, రావుల చంద్ర‌శేఖ‌ర్ రావు. పెద్దిరెడ్డి, అర‌వింద‌కుమార్ గౌడ్, ద‌యాక‌ర్ రెడ్డి, అరికెల న‌ర్సారెడ్డి, పేర్లు రాజ్య‌స‌భ రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీ ల‌భించిన‌ప్ప‌టికీ, ఇప్పటి వ‌ర‌కూ అది ద‌క్క‌క‌పోవ‌డంతో, త‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇవ్వాల‌ని కోరుతున్నారు. పార్టీ స‌భ్య‌త్వాల‌తో పాటు... కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న‌లో నాయ‌క‌త్వానికి ద‌న్నుగా ఉంటున్న ఇనుగాల పెద్దిరెడ్డి కూడా సీటు ఆశిస్తున్నారు.  త‌న బాధ్య‌త‌లే నిర్వ‌హించిన క‌ళా వెంక‌ట్రావు కు ఏపీలో పార్టీ అధ్య‌క్ష ప‌దవి ఇచ్చి నాయ‌క‌త్వం, త‌న‌ను మాత్రం అధికార ప్ర‌తినిధిగా ప‌రిమితి చేయ‌డంతో అలిగి చాలాకాలం పార్టీ ఆఫీసుకు  రాకుండా దూరంగా ఉన్న పెద్దిరెడ్డిని బాబు బుజ్జగించారు. సీనియ‌ర్ నేత‌, వివాద రహితుడు, అనుభ‌వాన్ని పార్టీ వినియోగించుకుంటోంది. ఆయ‌న పేరు కూడా రాజ్య‌స‌భ రేసులో వినిపిస్తోంది. ఇక రాజ‌ధాని న‌గ‌రంలో పార్టీ ఖాళీ అయినందున‌, మ‌ళ్లీ ఊపు, ఉత్సాహం రావాలంటే బీసీ కోటాలో సీనియ‌ర్ నేత అర‌వింద్ కుమార్ గౌడ్ కు ఇవ్వాల‌న్న సూచ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 


ఇప్ప‌టి వ‌ర‌కూ త‌నకు అన్యాయం జరిగిందున‌, ఈసారైనా న్యాయం చేయాలంటున్నారు. నిజానికి ఆయ‌న‌కు టీఆర్ఎస్ లో చాలాకాలం క్రిమే ఆహ్వానం అందినా... వెళ్ల‌కుండా పార్టీని అంటిపెట్టుకున్నారు. అదే విధంగా మ‌హ‌బూబ్ న‌గర్ జిల్లా నుంచి సీనియ‌ర్ నేత కే. ద‌యాక‌ర్ రెడ్డి, న‌ల్ల‌గోండ జిల్లానుంచి ఉమామాద‌వ‌రెడ్డి, నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్సీ అరికెల న‌ర్సారెడ్డి పేరు కూడా రాజ్య‌స‌భ రేసులో వినిపిస్తోంది. అయితే ఏపీలో అలాంటి స‌మస్యేమీ లేదు. అధికారంలో ఉన్న పార్టీ కాబ్బ‌టి పార్టీనేత‌ల‌ను ఎదో ఒక విధంగా స‌హ‌కారించుకుంటూ ముందుకుపోయే వెసులు బాటు ఉంది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంలో గ‌త కొద్ది నెల‌ల నుంచి చంద్ర‌బాబు కోటా ఒక‌టి అమల‌వుతూ వ‌స్తోంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ రంగంలోకి దిగిన‌ప్పుడు మాత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీ కోటా అనే పేరు ప్ర‌చారంలో ఉంది. తాజాగా నంద‌మూరి హ‌రికృష్ణ కూడా బ‌రిలో ఉండ‌టంతో ఈసారి కూడా ఫ్యామిలీ కోటా అమ‌ల‌వుతుందా?  లేక మారిన కుటుంబ రాజ‌కీయ ప‌రిస్థితుల‌లో ఆ కోటాకు తెరదించుతారా? అన్న చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. 
 

ఇకపోతే.. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చాలా కాలం నుంచి పార్ల‌మెంట్ కు వెళ్లాల‌న్న కోరిక‌తో ఉన్నారు. సీనియ‌ర్లు పార్ల‌మెంట్ కు వెళ్లి, కొత్త‌వారికి అవ‌కాశాలివ్వాల‌ని మూడేళ్ల నుంచి బ‌హిరంగంగానే మాట్లాడుతున్నారు. నిజానికి గ‌తంలోనే ఆయ‌న రాజ్య‌స‌భ ఆశించిన‌ప్ప‌టికీ, ఆయ‌న‌ను కాద‌ని సీఎం రమేష్ కు ఇచ్చారు. ఈసారి ఆయ‌న పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. ఎన్టీఆర్ త‌న‌యుడ‌యిన నంద‌మూరి హ‌రికృష్ణ కూడా ఫ్యామిలీ కోటాలో రాజ్య‌స‌భ సీటు ఆశిస్తున్నారు. ఈ సారి ఫ్యామిలీ కోటా ఉంటే ఆయ‌న‌కు ద‌క్కుతుందంటున్నారు. గ‌తంలో తాను స‌మైక్యాంద్ర కోసం తన ప‌ద‌విని త్యాగం చేసినందున, ఈసారి ఆయ‌న‌కు ఇవ్వాల‌ని ఒత్తిడి చేస్తున్నారు. అదే విధంగా వైసీపీ నుంచి పార్టీలో చేరిన మాల వ‌ర్గానికి చెందిన జూపుడి ప్ర‌భాక‌ర్ రావు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అయ‌న‌కు కాంగ్రెస్ కు చెందిన ఓ రాజ్య‌స‌భ స‌భ్యుడు కూడా సిఫార‌సు చేస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.


అయితే ఆశించడం త‌ప్పేమీ కాదు కానీ, ఎవ్వ‌రికి ఇవ్వాల‌న్న‌నిర్ణ‌యం పార్టీ అధిష్టానం పైనే అధార ప‌డి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన అనంత‌రం జాతీయ పార్టీగా ఎదిగిన నాటి నుంచి కేవలం అంధ్ర‌ప్ర‌దేశ్ కే ఎక్కువ‌శాతం దృష్టి పెడుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ లో ఉన్న పార్టీ దాదాపుగా బిచానా ఎత్తేసే స్థితికి చేరుకుంది. అయితే... చంద్ర‌బాబు వ్య‌వ‌హారంతోనే ఈ దుస్థితి ఏర్పడింద‌ని ఆ పార్టీ నేత‌లు సైతం గుస గుస లాడుతున్నారు. తెలంగాణ లో మిగిలిన చివ‌రి చాన్స్ రాజ్య‌స‌భ సీట్ల వ్య‌వహారం. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఏక‌ప‌క్షంగా ఉంటుందా లే క ఇరు రాష్ట్రాల‌ను క‌లుపుకుపోయే అవ‌కాశం ఉంటుందా అన్న‌ది ఇప్పుడున్న ప్ర‌శ్న‌. చివ‌రిగా మ‌రోసారి తెలంగాణ రాష్ట్రంలో అవ‌కాశం వ‌చ్చిన నేపథ్యంలో పార్టీ అధినాయ‌కుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో, ఈ నిర్ణ‌యం తో జాతీయ పార్టీ గా ఎదిగిన టీడీపీ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: