సార్వభౌముల సామ్రాజ్యపు కోటల చరిత్ర త్రవ్వి తీస్తే ఏన్నో రహస్యాలు, ఇంకెన్నో కుట్రలు, కుతంత్రాలు బయల్పడుతుంటాయి. ప్రజలకు రాజస్వామ్యం లో ప్రశ్నించే హక్కులేకపోవటం వలన ఆ రహస్యాలు కుట్రలు కుతంత్రాలు అలాగేఉండి అప్పుడప్పుడూ బయటకు త్రవ్వకాల్లొ నుండో, రహస్య పత్రాల్లో నుండో, తొంగి చూస్తూ మనల్ని అబ్బురపరుస్తుంటాయి. కాని నేటి ప్రజాస్వామ్యం ప్రాథమిక మూలసూత్రమే పారదర్శకత. అంతా ట్రాన్స్పిరెంటుగా ఉండాలి. ఇక్కడ ప్రతి కార్యక్రమం ప్రజలచేత, ప్రజలకు, ప్రజలకొరకు, ప్రజా ధనంతో జరుగు తుంటాయి. ప్రభుత్వం చేసే ఏపనైనా ప్రజల తరపుననే జరుగుతుంటాయి. అందుకే ఏరహస్యము లేని రాజధాని నిర్మాణము జరగాలి.


అసలు అమరావతి నిర్మాణం 11 జిల్లాల ప్రజలకు ఇష్టంలేదు. 4 జిల్లాల రాయలసీమవాసులకు ఏమాత్రం రాజధాని నిర్మాణం కృష్ణా-గుంటూరు జిల్లాలలో జరగటం ఇష్టంలేదు. 3 జిల్లాల ఉత్తరాంద్ర వాసుల అభిప్రాయాన్ని ఎవరూ, ఏప్పుడూ ఖాతర్ చేయటంలేదు. ఏమైనా అమరావతి నిర్మాణం జనాభిప్రాయం ప్రకారం జరగటంలేదన్నది మెజారిటి ప్రజల అభిప్రాయం.


అమరావతి శంకుస్థాపనకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ


ఇది ప్రక్కన పెట్టి ఈ నీలి నీడల సంగతి చూద్దాం.

* మన నూతన రాజధాని సింగపూరును తలదన్నే విధంగా ఉంటుందని ముఖ్య మంత్రి అనేక వేదికలపై పరిపరి విధాల పలుపలు సార్లు ఎలుగెత్తిచాటేవారు. కాని ఈ నగర నిర్మాణ సూత్రధారి సింగపూర్ బరినుంచి అమాంతం మాయమైంది. జనాభిప్రాయం కమీషన్లవిషయాలు కుదర్లేదేమో అనుకుంటున్నారు.


* సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అమరావతి శంకుస్థాపనలో ఒక ప్రముఖ పాత్రధారి. ఇప్పుడాయన మాటా - ముచ్చటి ఇసుమంతైనా కనిపించటలేదు. ఇందులో మతలబేమిటి.

 

* ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని సింగపూర్ ఆదర్శంగా నిర్మితమవ్వాలని ముఖ్యమంత్రి ఆశపడ్డారు. అందుకే తొలినుంచి ఈశ్వరన్ గారిని పదేపదే తలుసుకొంటూ వచ్చారు.

 

* బరినుండి సింగపూర్ తప్పుకోవటంలో కమీషన్ల కక్కుర్తి ఏమైనాఉందా? అవినీతి రహిత దేశాల పట్టికలలో సింగపూర్ కూడా ఒకటి. ఇక్కడ అవినీతికూపంలో ఇరుక్కోవటమెందుకనుకుందా? బరి లోనుంచి అందుకేతప్పుకుందా?


* అమరావతి భూసేకరణ జరిపింది ఏమాత్రము అనుభవంలేని నారాయణ అనే మంత్రివర్యులు. తొలిసారి ఎం.ఎల్.సి. గా రాజకీయాల్లోకి ప్రవేశమై మునిసిపల్ మంత్రిగా మంత్రిమండలిలోకి వచ్చి, తనదికాని రెవెన్యూ శాఖకు చెందిన ఈ భూసేకరణ వ్యవహారం అదీ ఉప ముఖ్య మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అనుభవజ్ఞుడైన కె.ఈ. క్రిష్ణమూర్తివంటి వారిని ప్రక్కనపెట్టి తతంగం నడిపించటంలో ఏమైనా కిరి-కిరి ఉందేమో అనేది పలువురి అనుమానం.


అమరావతీ రాజధాని నమూనా 

 

* ఒక ప్రముఖ ప్రింట్ మీడియా సీరియల్ గా ప్రచురించిన భూదందా నిజమేనని ప్రజలు నమ్మటానికి కారణం నారాయణ కు చెందినవారు, బినామీలు అధికంగా ఉన్నారని ప్రజలు పూర్తిగా విశ్వశిస్తున్నారు. అంతేకాదు అనేకమంది ఒకే కుల అంతెవాసులు ముందే అందుకున్న అంతర్గత సమాచారంతో దళితులు, వెనుకబడ్డ వర్గాల వారికిచ్చిన అసైండ్ భూములను భయపెట్టి తక్కువధరలకే లాగేసుకున్నారంటారు.

 

* విధానసభలో చర్చ మొదలైతే సిఎం సమాదానం బహు విచిత్రం. మేము భూములు కొనకూడదా? వ్యాపారం చేసుకోకూడదా? అంటూ ఎడ్డెమంటే తెడ్డెమనే సమాదానం ఇవ్వటం తప్పుకాదా ? అనుకొంటూ అమరావతి అనేక స్కాముల మయం అనే అభిప్రాయానికి ప్రజలెప్పుడో వచ్చేశారు.


అమరావతి నిర్మాణం ఇంతగా అనుమానాస్పదం అవటానికి కొన్ని ప్రజలు నమ్మే కారణాలు:


-ఒక కులాధిపత్యమే అధికంగా ఉన్న క్రిష్ణా-గుంటూరు జిల్లాలే అమర్రవతి గా రూపు దిద్దుకోవతం.


-ముఖ్య ప్రాంతాలైన ఉత్తరాంద్ర, రాయలసీమ వారికి ఇష్టం లేదు సుదూర ప్రాంతమవటం. వారికి సుతరామూ రాజధానిగా ఒకే కులాధిపత్య ప్రాంతము ఉండటం భరించరానిదిగా మారినది.


- ఒకే చోట అన్నీ అభివృద్ది కేంద్రాలు కేంద్రీకృతమవటము రేపెప్పుడో మరోవిభజనకు ఏపి సిద్దమవుతుందని ప్రజలు భావిస్తున్నారు.


- అసలు రాజధాని, ఆలోచన, ఆంతర్యం, సమాలోచన అంతా కొద్దిమంది ఆంతర్యంతోనే జరగటం సామాజికంగా అంగీకారానికి నోచుకోలేదు.


- ముఖ్యంగా ఒక దశాబ్దకాలం ఉచితంగా హైదరాబాదు ను సమ్యుక్త రాజధానిగా పంచుకొనే అవ కాశం వదులుకొని అమరావతిని యుద్ద ప్రాతిపదికగా మార్చే విషయం ప్రాధాన్యతా క్రమం లో అంత ముందుంచవలసిన అవసరములేదు. ఈ ఆలోచనే అవశేష అంద్రప్రదేశ్ కు ఆర్ధికంగా అత్యంత ప్రమాదకరం. మరి రాజధాని గా అమరావతిపై తొందరెందుకు. దశాబ్దకాలం హైదరా బాదు ను రాజధానిగా ఉపయోగించుకొనే సమయమున్నదనే కేంద్రం ప్రాదమ్యాలను మార్చు కొని ఉండవచ్చు. రాజధానికి నిధులు సమకూర్చే భాద్యత కేంద్రానిదే అయినప్పుడు, కేంద్రం మెడలు వంచి పనిచేసుకోవలసిన సిఎం తనంటతానే రాజధాని నిర్మాణానికి పూనుకోవటమే అనేక అనుమానాలకు తావిస్తుంది.కెంద్రానికి ఇందులో తావిస్తే తమ కుట్ర, కుతంత్రం, రహస్యాలు బయటపడతాయని భయమేమో అనుకుంటున్నారు మేధావులు.


-దార్శనికుడైన సిఎం అమరావతి విషయములో మర్మం పాటించటానికి తన విస్తృత ప్రయోజనాలే కారనమని భావిస్తున్నారు.


-సింగపూర్ ఈశ్వరన్ తో అంతా రహస్యసమావేశాలే జరిగాయంటారు. ఆ చర్చల విషయమేమిటో ప్రజలకు ఏమాత్రం తెలియదు. అంతేకాదు టిడిపి లో ఎవరికీ తెలియదు. అంత నిగూడరహస్యమేమిటి? పరిపాలనతో నిగూఢ రహస్యాలుంటే అది నియంతృత్వమేతప్ప ప్రజాస్వామ్యం కాదంటారు. సంవత్సరకాలం వృధా అయ్యాక సింగపూర్ ఎందుకు తప్పుకుందో సమ్యుక్త ప్రకటన చేస్తేనైనా ఈ విషయంలో సిఎం పైన కొంతైనా అనుమానం తగ్గే అవకాశం ఉంది. ఆయన దానికెందుకు పూనుకోరో అర్ధం కావటంలేదు అంటున్నారు.


- ప్రభుత్వ భవన సముదాయాలకు ఒక కోటిన్నర చదరపు అడుగుల స్థలం ఒక వెయ్యి ఎకరాల భూమిలో సరిపోతుంది. 7000 నుండి 8000 ఎకారాల భూమి మౌలిక సౌకర్య కల్పనకు సరిపోతుంది. ఒక 8000 ఎకరాలు అభివృద్దిచేసిన భూభాగం భూమి ఇచ్చిన ప్రజలకు తిరిగి యివ్వటానికి సరిపోతుంది. దీనికి 16000 నుండి 17000 ఎకరాల భూమి సరిపోయేదానికి 33000 ఎకరాల భూసేకరణ ఎందుకు చేశారు. ఇందులో మిగిలిన 17000 ఎకరాల భూమిని ఎమిచేయాలని? ఇందులోనే మర్మం, రహస్యం, కుతంత్రం, కుట్రకోణం దాగి ఉందనేది ప్రజాభిప్రాయం. ఈ మిగులు భూమిని ఆ కులాధిక్యులకు, అందులోని ప్రారిశ్రామిక, భవన నిర్మాణదారులకు పంపకం పందేరం చేసే ఉద్ధేశం లేకపోలేదని అనుమానం.


- కోటిన్నర చదరపు అడుగుల నిర్మాణానికి అడుగుకు 3000/- రూపాయిల లెఖ్ఖన 4500 కోట్ల రూపాయలు అవసరం. అందులో 1800 కోట్ల రూపాయలు కేద్రం విడుదల చేయగా ఇంకా 2700 కోట్ల రూపాయలు తక్కువవుతాయి. అలాంటప్పుడు ప్రపంచ బాంకు నుండి 6500 కోట్లు అప్పు ఎందుకుతీసుకోవాలి? ధనం వృదా చేసే లేదా మ్రింగివేసే ఉద్ధేశం ఉందా?


అమరావతి నమూనాను పరిశీలిస్తున్న పీఎం నరేంద్ర మోడీ


ప్రజా ఋణభారం పెరగదా? దీని మతలబేమిటి?


- విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణ భాధ్యత కేంద్రానిది. ఈ విషయంలో కేంద్రం పని రాష్ట్రం చేస్తే రేపు కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశాన్ని ఫణం గా పెడుతున్నామంటే- ఇందులో స్కాం చేసే అవకాశం పోగొట్టుకోవటం ఇష్టం లేకే గదా? అని అనుకొంటున్నారు.


- ఇప్పటికి కేంద్ర ఆర్ధికమంత్రి విభజనచట్టాన్ని 100% అమలుచేస్తామని తొణుకు, బెణుకు లేకుండా ఆయన ఉధ్ఘాటిస్తూనే ఉన్నారు. అరుణ్జైట్లీ కామెంటును రిఫర్ చేస్తూ మోడీని మోడీని రిఫర్ చేస్తూ జైట్లిని ఫాలోఅఫ్ చేస్తే పనులవ్వవచ్చు. కాని ఇందులో ఏదో తిరకాసుంది. సిఎం ఏదైనా విషయంటో కేంద్రంతో ఇరుక్కున్నారా? అది భూదందా కావచ్చు, విదేశీ సహకారం కోసం విపరీతం గా అర్రులు చాస్తూ ఏదైనా తప్పు లో ఇరుక్కున్నారా? ఓటుకు నోటు తీవ్రత, ఇంత ఆర్ధిక ఇబ్బందులలో కూడా హైదరాబాద్ను రాజధానిగా పంచుకోక పోవటాన్ని కేంద్రం నిలదీయవచ్చనే భయమా?


- విభజన చట్టాన్ని అమలుచేయించమని సుప్రీం కోర్ట్ లో ప్రయివేటు పిటీషన్ వేయించి కేంద్రం పై వత్తిడి తేవచ్చుకదా? ఎందుకంటేఅ కెంద్ర పభుత్వం తమ మిత్ర పక్షమని ఇబ్బంది పెట్టకుండా. అలాజరిగితే రాజధాని నిర్మాణాన్ని కోర్టులు ప్రశ్నించే అవకాశం ఉండి ఇతర ప్రైవేటు పిటీషన్లు పడి రచ్చ-రచ్చ అయ్యి చివరికి అంతా ప్రశ్నార్ధకం అవ్వచ్చనే భయం అంటారు కొందరు.

- కెంద్రం మౌనం జనాలకు ఇంకా అనుమానాల్ని రేపుతున్నాయి. కారణం ఈ తతంగాన్ని దూరము నుంచి గమనించకుండా ఉంటుందా? నివేదికలంది, ఈ మసి మనం పూసుకోవటమెందుకని, సమయంకోసం ఎదురుచూస్తుందా? అసలా రెండు (చైనా లాంటి చీకటి)జిల్లాలలో అంతరంగంగా జరిగే కుల, తస్మదీయుల దోపిడీ కూడా కేంద్రానికి తెలియకుండా ఉంటుందా ? అందుకే మనకు కొంచెం మట్టి, కొంచెం నీరూ ఇచ్చి నాటకం చూస్తుందేమో? లేకుంటే లోపల సిఎం కోటరీ వ్యవస్థ భండారం చేజిక్కించిఉకొని వుండవచ్చని అనుకుంటున్నారు. అందుకే అమిత్-షా రాజమండ్రిలో వ్యూహాత్మకంగా వ్యవహరించారా? ఇవీ ప్రజలకు అంతుపట్టీ పట్టని విషయాలు.


- సాక్షి కథనాలను ప్రజలు కొట్టిపారేయటంలేదు. అలాగే వైసిపి ఎమెలేలను ఎరవేసి పట్టటాన్ని కూడా క్షమించరు, టిడిపికి అసలు సానుకూలతేలేదు. రావలసింది సమయమూ-సంధర్భమే. రోజాను అమెను శాసనసభ నుండి ఒక ఏడాది భహిష్కరించటమంటే అమెంత టిడిపిని-నాయకత్వాన్ని భయపెట్టిందనే విషయాన్ని గమనిస్తున్నారు. అమెపై సానుభూతి రానున్న కాలంలో ఓట్లుగా మారే అవకాశాన్ని గుర్తించే అమె ప్రయారిటీ కమిటీ ముందుకు వచ్చి క్షమాపణ చెపితే చాలని ఫీలర్లు వదులుతున్నారని జనం మాట్లాడు కుంటున్నారు.రేపు సుప్రీం కోర్ట్ అమెకు అనుకూలంగా స్పందిస్తే టిడిపి నాయకత్వానికి, సభాపతికి, శాసనసభ వ్యవహారాల మంత్రికి ఇదంతా అడ్డంగా చుట్టుకునే అభిప్రాయాన్ని నిష్కర్ష గా కొట్టివేయలేము.


- అమరావతి విషయమంతా నివురుగప్పిన నిప్పే ఒక ప్రభజనం వస్తే బూడిద గాలిలోకలిసి అగ్గిరాజుకోవటం ఖాయమని ప్రతిఒక్కరు టిడిపి వాళ్ళతోసహా అనుకుంటున్నారు. అధికారంలో ఉంది కదా అని బహిరంగ వ్యతిరేకత చూపటం లేదు. కలిసివచ్చినపుడు అగ్నికి ఆధ్యమే అంతారు ప్రముఖులు పరిశీలకులు. "ఆందోళన చిరుజల్లు గా ఉంటే చర్చించుకుంటాం అదే జడివానైతేనే దానిని అడ్డగించలేము".


- అమరావతి వస్తు-ప్రతిష్ట అంటే బ్రాండ్ వాల్యూ అనే దానిని సింగపుర్ వైదొలగటంతోనే దిగజారిందని, జపాన్ విఫణి విషయంలో సింగపూర్ అంత నీతివంతమైనది కాదని ఇప్పటికే భారత్ లో జపాన్ వాహన కంపెనీల తో అనుభవ మున్నవారు డీలరుషిప్పులు కావాలంటే కోట్లలో లంచాలు మింగేస్తుంటారని అనేకమంది వాహన డీలర్ల సమావేశాల్లో ఒకరితో ఒకరు వేదనని పంచుకుంటారని తెలుస్తుంది. ఈ లంచాలన్ని వారి భారతీయ కౌంటర్ పార్ట్స్, ఉద్యోగులే చేస్తున్నారా? లేక జపాన్ కంపనీలే చేయిస్తున్నాయా అనేది ఇంక బయటకు రాలేదని అంటుంటారు.


-అమరావతి బ్రాండ్ వాల్యూను దిగజార్చిన అంశాల పట్టిక పెద్దదే. పదేపదే వివరించటం అంటే "శాసనసభలో టిడిపి నాయకులు జగన్ని గూండా, దొంగ, అవినీతి పరుడని తిడుతూనే...తాము అదేదారిలో పయనించటం కనిపిస్తున్నంత పెద్దది" కాల్-మని, దాని జంటైన సెక్స్, వనితలపై అనాగరిక వంచన, రిషితేస్వరి లాంటి విధ్యార్దినుల మరణం, వనజాక్షి లాంటి ఉద్యోగినుల గౌరవభంగం, లెక్కకు మిక్కిలి విద్యార్దుల మరణాలు, అందులోనూ మంత్రిగారి స్వంత సంస్థలలోనే ఎక్కువగా జరగటం...రాస్తే చిట్టా చాంతాడంత ఉంటుంది ప్రజలు చెప్పేవి చర్చించేవి రాసినా కూడా? ఆ తిమిరం వ్యాపిత జిల్లాల్లో జరిగే దగాలు, మోసాలు, దగుల్బాజీ పనులను వాటిని నిరహించే వారెవరో మీడియా ద్వారా అందరికీ చిరపరిచితమే.


-యూనివర్సిటీల్లోని కులసంఘాలను కూడా నిర్మూలించలేని ప్రభుత్వమూ ఒక ప్రభుత్వమేనా అంటుంటారు తెలంగాణాలో. కెసిఆర్ లాగా నిభాయించే సామర్ధ్యం కూడా సిఎం కు లేకపోయిందని దానికి ఆశ్రితపక్షపాతమే కారణమని అంటుంటారు.


-ఇక అమరావతిలో భూదందాని వెలికితీయాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తే, భాషణలోని అవేశంతో దొర్లే పదాలని పట్టుకొని ప్రతిపక్ష నాయకులనే వెలివేసే విష సంస్కృతి టిడిపిలో ప్రభలి పోతుందని అంతా భావిస్తున్నారు.


- అమరావతి బ్రాండ్-వాల్యూ పరిరక్షించాలంటే ఒకటే మార్గం విచారణ జరిపించటమే. దానికి కావలసింది నాయకత్వానికి చిత్తశుద్ది.


నిప్పులాగా నిజాయతీగా ఉన్నాము అని అంటే చాలదు - నిజాయతీగా ఉన్నట్లు పారదర్శకంగా కనిపించటం కూడా ముఖ్యమే అంటుంటారు పెద్దలు.


మరింత సమాచారం తెలుసుకోండి: