భారత దేశంలో ప్రతి మద్య తరగతి,సామాన్యుడికి అతి చేరువైనది..తక్కువ ఖర్చుతో ప్రయాణించగలిగేది ఒకే బండి అదే రైలు బండి. రోజూ ఉద్యోగం,వ్యాపారం,చదువు కోసం ఈ రైలుబండిలో నిత్యం లక్షల మంది ప్రయాణిస్తూనే ఉంటారు. ప్రపంచంలో కొన్న అగ్ర దేశాల్లో హై స్పీడ్ రైళ్ల జోరు బాగా ఉంది...తాజాగా ఇప్పుడు భారత్ లో కూడా  హై స్పీడ్‌ రైళ్ల శకం ప్రారంభమైందనే చెప్పాలి. అందుకు నిదర్శనమే ఇవాళ ప్రారంభమైన గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌. గంటకి 160కి.మీ వేగంతో ప్రయాణం చేయడం దీని ప్రత్యేకత.

 ఈ ఎక్స్ ప్రెస్ వల్ల ఢిల్లీ నుంచి ఆగ్రా కేవలం వందనిమిషాల్లో చేరుకోవచ్చు. కాగా టిక్కెట్ ధర మాత్రం సామాన్యులకు భారంగా అనిపిస్తుంది. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కోచ్‌లు, ఎనిమిది సాధారణ ఏసీ కోచ్‌లు ఉంటాయి.

సాధారణ ఏసీ కోచ్‌లో టిక్కెట్‌ ధర రూ.750. ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కోచ్‌లో టిక్కెట్‌ రూ.1500. రైలులో ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో కేటరింగ్‌ సర్వీస్‌ నడుస్తుందని రైల్వేశాఖ వెల్లడించింది. రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును జెండా వూపి ప్రారంభించారు.  గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఢిల్లీ నగరంలోని హజ్రతి నిజాముద్దీన్‌ స్టేషన్‌ నుంచి ఆగ్రా కంటోన్మెంట్‌ స్టేషన్‌ వరకు నడుస్తుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: