ప్రపంచంలో మనిషి కనిపెట్టిన డబ్బు..ఆ డబ్బు కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నాడు. డబ్బు సంపాదించడమే పరమావధిగా ఎన్నో నిచమైన పనులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో డబ్బు ఎలా వచ్చింది కాదు..ఎంత ఉన్నదీ అన్నదే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు... కష్టపడి సంపాదించ రూట్లు మానేసి ఈజీ మనీకోసం వెంపర్లాడుతున్నారు. దీనికోసం సోసైటీలో ఎన్నో అరచకాలు చేయడం మొదలు పెట్టారు..హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ దందా, అక్రమ ఆయుధ వ్యాపారాలు, పబ్, రేవ్ పార్టీల నిర్వహణ, బ్యాంక్ దోపిడీలు అడ్డదారుల్లో వెళ్లి సంపాదిస్తున్నారు. అయితే ఇలా సంపాదించిన సంపాదన ఎంత వరకు ఉంటుందో కానీ బయట పడి జైళ్లలో మాత్రం ఉంటున్నారు.

మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం


ఇక పెద్ద పెద్ద నగరాల్లో హైటెక్ వ్యభిచారాలతో విటులను ఆకర్షిస్తూ ఈజీగా డబ్బు సంపాదిస్తున్నారు. గ్రామీణ మహిళలు,యువతుల అవసరాలు ఆసరాగా చేసుకొని వారిని వ్యభిచార కూపంలోకి నెట్టి వేస్తున్నారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్లు,మసాజ్ సెంటర్లు లాంటివి నిర్వహిస్తూ బయటకు మాత్రం చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ లోపల చీకటి రాజ్యం ఏలుతుంటారు. ఇలాంటి హైటెక్ వ్యభిచారం కోసం ఇంటర్నెట్, సెల్ ఫోన్లు లాంటి టెక్నాలజీ వాడుతూ వెబ్ సైట్లు నిర్వహిస్తూ..విటులను ఆకర్షించి వారి అవసరాలను బట్టి రెట్లు ఫిక్స్ చేస్తూ ఉంటారు..అయితే ఇలాంటి దందాలు నిర్వహించే వారికి కొంత మంది రాజకీయ నాయకులు, పోలీసులు కూడా సహకరించడం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హైటెక్ వ్యభిచారం చేస్తూ పట్టబడ్ట సినీనటి సుకన్య


తాజాగా బ్యూటీ పార్లర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్‌కు చెందిన కోట సంపతకుమార్‌ మరో యువతితో కలిసి రోడ్డు నెంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో లోటస్‌ ఫ్యామిలీ సెలూన్‌ పేరిట బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తున్నారు. డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకున్న ఆశతో రఘు అనే వ్యక్తి బ్రోకర్ గా నిర్వహిస్తూ ఈ బ్యూటీ పార్లర్ ను కేంద్రంగా చేసుకొని కొంత మంది యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు సెక్స్‌ వర్కర్‌లను పునరావాస కేంద్రానికి పంపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: