ప్రస్తుతం వైసీపీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వారానికో ఎమ్మెల్యే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. టీడీపీలోకి వెళ్లేవారు.. అభివృద్ధి కోసం నిధుల కోసం వెళ్తున్నామని చెబుతున్నారే గానీ.. జగన్ వైఖరిపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. అసలే జగన్ కు అహంభావి అని.. ఎవరిమాట వినడు అనీ, పెద్దలను సంప్రదించడనీ అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. 

ఐతే.. ఈ కష్ట సమయంలో జగన్ కు కాస్త అండగా నిలిచేవారిలో ఆయన ఆడిటర్ కమ్ పొలిటీషియన్ విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందువరుసలో ఉంటారు. అయితే పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్న నేతల గురించి వీరు సమాచారం సేకరించి ముందుగానే జగన్ చెవిన వేస్తున్నారట. అయితే జగన్ వాటిని అంత సీరియస్ గా తీసుకోవడంలేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. 

జంపింగులను ఆపడం వీరి వల్ల కావడం లేదా...!?



జగన్ లైట్ గా తీసుకోవడం వల్లే ఇంతమంది నాయకులు వెళ్లిపోతున్నారని.. లేకపోతే ఈ నష్టం ఇంకా చాలా తక్కువ ఉండేదని ఓ వాదన ఉంది. ఈ వాదనలు ఎలా ఉన్నా.. ఒక్కసారి నాయకులు పార్టీ మారాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరు చెప్పినా పెద్దగా ఫలితం ఉండదు. కానీ వైసీపీ నుంచి ఫలానా వాళ్లు టీడీపీలోకి వెళ్తున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినప్పుడు మాత్రం జగన్ వారి వద్దకు రాయబారం కోసం పార్టీ నాయకులను పంపుతున్నారు. 

ఇలా వెళ్లే బృందంలో విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పనిసరిగా ఉంటున్నారు. కానీ వీరు ఎంత నచ్చజెప్పినా అప్పటికే చంద్రబాబుకు మాట ఇచ్చేసిన నాయకులు మాత్రం వైసీపీలో కొనసాగేందుకు ససేమిరా అంటున్నారు. ఒక్కోసారి బుజ్జగింపుల కోసం తమ ఇళ్లకు వచ్చిన  విజయసాయి, చెవిరెడ్డిలను గంటల తరబడి వెయిట్ చేయించడం.. సార్ ఇప్పుడు లేరు.. ఎటో వెళ్లారు అని చెప్పించడం జరుగుతోందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: