ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యం ఆవహించింది.  ప్రస్తుత అధికార పార్టీ నాయకుడు చంద్రబాబులో నాయకత్వ సమస్యలేదు. ఆయనకు లేనిదల్లా మంత్రివర్గ బృందాన్ని సమర్ధవంతం గా నడిపించలేని చేతకానితనం, అశక్తత. కారణాలేమైనా నాయకుడు, మంత్రి వర్గం బండికి వలపట దాపట ఎడ్లలా సరిగా నడిస్తేనే బండి సరిదారిలో నడుస్తుంది. పరిపాలన సజావుగా నడుస్తుంది. రెండెడ్లు ఒకటి ఒక ప్రక్కకి మరోటి మరో ప్రక్కకి నడిస్తే బండినడక అంధ్రప్రదెశ్ లో టిడిపి పాలనలా ఉంటుంది. ఆ పార్టి సభ్యులు ప్రభుత్వం మీద మితిమీరిన పెత్తనం చేస్తున్నారు. అది కుల పెత్తనం కావచ్చు, అధికారమధం కావచ్చు. రాజధాని అమరావతిలో బయటపడ్డ కాల్మని, స్త్రీలపై లైంగిక హింస ఈ మొత్తంలో ఎవరు నేరస్తులో రాజధానిని మిగతా రాష్ట్రం నుంచి, చంద్రబాబు కులాన్ని మిగతా కులాల నుండి, వేరుచేస్తున్న విషయం గుర్తించక పోవటం నాయకత్వానికి పట్టిన గ్రహణమే.

Image result for amravati city in andhra

ప్రతిపక్ష మీడియా అమరావతి లో భూ సేకరణ లోపాల్ని అవినీతిని అక్రమాల్ని వాటికి మంత్రులకు, టిడిపి కార్యకర్తల స్థాయి నుండి మద్య, ఉన్నత స్థాయి నాయకులవరకు ఉన్న సంభందాల్ని ఎండగట్టింది. ప్రజలు మాత్రం పూర్తిగా నమ్మినట్లె ఉన్నారని, సి.ఎం.ఎస్ సర్వె కూలంకషంగా బయటపెట్టింది. నాయకుల మితిమీరిన స్వార్ధము రోడ్లపైనే కనపడుతుంది. రోజా పై శాసనసభ లో జరిగిన రచ్చ అధికార పక్ష ప్రతిష్ఠ నేలబారు చేసింది. శాసన సభకు, న్యాయశాఖల మధ్య ఒకరకమైన ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ప్రజలు అభివృద్దిని మాత్రమే గౌరవిస్తారు. లోపాలని మన్నించరు. కులం విషయములో, రాజధాని ప్రాంత విషయములో మిగతా కులాలకు, మిగతా ప్రాంతానికి నిట్టనిలువు విభజన గీత ప్రస్పుటంగా గీయబడింది. దీనికి ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని చంద్రబాబే కారణం అంటారు.

Image result for amravati city in andhra

అమరావతి విషయములో, పాలన విషయములో మితిమీరి అధికార పక్ష మీడియా కలగచేసుకోవటం ఇతర మీడియాకు ప్రజలకు నచ్చటములేదు. దురదృష్టవశాత్తు అధికారపక్ష మీడియా పూర్తిగా చంద్రబాబు కులానికి, అమరావతికి చెందిఉండటం కూడా ప్రజల్లో అధికారపక్షం పై వ్యతిరేఖత పెరిగిపోవటానికి ప్రధాన కారణమని ప్రజలు భావిస్తున్నారు.యెల్లో మీడియా అని ముద్దుగా పిలవబడే ప్రసారమాద్యమం అయినదానికి కానిదానికి అధికారపక్షాన్ని వెనకేసుకు రావటం ప్రజలకు కంటగింపుగా మారి పోయింది. ప్రజలు టిడిపి విధానాల్ని యెల్లో మీడియాలో చూసి, నిజమేమిటో ప్రతిపక్ష మీడియాలో చదివి నిజా నిజాల బేరీజు వేసుకునే పరిస్థితి ఆంధ్ర ప్రదెశ్ లో ఉంది. దీన్ని బట్టి ప్రజలు ప్రత్యామ్న్యాయం లేకే టిడిపి ని భరిస్తున్నారని తెలుస్తుంది. అదే సి.ఎం.ఎస్ సర్వె లో వ్యక్తమైంది.


బిజెపి, తన మిత్రపక్షమైన టిడిపి ని దూరం పెడుతుంది, విభజన ప్రయోజనాలని విడుదల చేయకపోవటానికి కారణం టిడిపి ప్రభుత్వములోని మితిమీరిన అవినీతి ఆశ్రిత పక్షపాతమే అంటారు విజ్ఞులు. సహాయం చేసినా ఆ ప్రతిభ తమదే నని హైజాక్ చేసి ప్రచారం చేసుకునే టిడిపి తత్వాన్ని బిజెపి గ్రహించి ' అడుసు తొక్కనేల - కాలు కడగనేల ' అన్నట్లు దూరంగా ఉంటుంది. ఏమైనా ఈ బంధం విడాకుల కే దారితీస్తుందని పిస్తుంది. తన పార్టీని మిత్రపక్షాన్ని కూడా సమన్వయం చేయలేని దురవస్థ టిడిపి నాయకత్వానికి ఏర్పడింది. వీటికి తోడు టిడిపి కెంద్రమంత్రుల పుత్రరత్నాలు రాష్ట్రమంత్రుల పుత్రరత్నాలు తెచ్చి పెడుతున్న దుస్థితులు కూడా పార్టికి కావలసినంత అపకీర్తి మూటకడుతున్నాయి. నిన్నటి రోజున కేంద్రమంత్రి సుజానా చౌధరి కొడుకు అర్ధరాత్రి మితిమీరిన వేగముతో హైదరాబాద్లో రెండుకోట్ల రూపాయల విలువైన పోష్ స్పోర్ట్స్ కార్లో వెళుతుంటే తెలంగాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 184 (బి) సెక్షన్ క్రింద సాయికార్తీక్ పై కేసు నమోదైంది. అలాగే మరో ఏ.పి మంత్రి రావెల కిషొర్ బాబు తనయుడు రావెల సుశీల్ ఒక మహిళను కార్లోకి గుంజి టీజ్ చేయ ప్రయత్నించిన కేసులో అరెష్టు అయ్యాడు అదీ హైదెరాబాద్ లోనే.


ఇదే అమరావతి లో ఐతే కేసులు పెట్టేవారా?  పెట్టటం జరగదని, బోండా ఉమ కుమారుడు కార్ రైడ్ కెసులో ఒక వ్యక్తి మరణించినా దానిపై విచారణలేదు.  ఇదంతా ఏ.పి ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. మంత్రులే కాదు తండ్రుల అవినీతితో సంపాదించిన ధనంతో బలిసిన మంత్రుల కొదుకుల మదం కూడా టిడిపి అంత్యక్రియలకు సమిధలు చేరుస్తున్నాయి. సుజనా చౌదరి తనకు సుజానా యునివర్సల్ కు సంభందం లేదని మారిషస్ బాంక్ కేసు విషయములో నిర్ధారించారు. అలాంటప్పుడు తన కొడుకు సుజానా యునివర్సల్ కు చెందిన కారును ఎలా వాడుతున్నాడు. ఈ విధంగా టిడిపి ప్రముఖులంతా అబద్దాల కోరులనే భావన వ్యాప్తిలో ఉంది. ప్రతిపక్షాన్ని సమూలంగా హరించేటందుకు టిడిపి చేసే ప్రయత్నాల్లోని కుట్ర కోణాన్ని ప్రజలు ఊహిస్తునారు.


భవిష్యత్తులో విదేశాల ఆర్ధిక సహాయము తో తలపెట్టిన అమరావతి అభివృద్దిపేరుతో చేయబోయే ధనయజ్ఞంలో జరగనున్న జరిపించనున్న అవినీతి అక్రమాలపై ఎవరూ ప్రశ్నించ కుండా శాసన సభలో వైరిపక్షమే లేకుండా చేసే కార్యక్రమమని ఒక మర్మంతో కూడిన ప్రజలు కుట్రగా ప్రజలు ఊహిస్తున్నారు భావిస్తున్నారు. టిడిపి కి శాసన సభలో కావలసినంత సభ్యుల బలమున్నపుడు ప్రతిపక్ష నిర్మూలన అవసరమేముంది? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రులంతా అసమర్ధులని అనేక సంధర్భాల్లో ఋజువవుతూవస్తున్న సంధర్భాలెన్నో. నారాయణ లాంటి మంత్రులను మచ్చలేనివారని చంద్రబాబు ఎలుగెత్తి చాటినా జనం నమ్మనంత దుస్థితి ఆయనది. ఈ మద్య కేశవ రెడ్డి సంస్థలను చైతన్య సంస్థలతో విలీనం చేయటములోని ఔచిత్యాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. తన కులము వారికి దోచి పెట్టి పర కులాల వారిని ఊడ్చిపెట్టే టిడిపి సంస్కృతి ఎప్పటికి ప్రశ్నార్ధకమే.

బాబు అలోచనలు నింగిలో, మంత్రుల తీరు పాతాళములో.

మరింత సమాచారం తెలుసుకోండి: