"అంధ్రప్రదెశ్  కు  ప్రత్యేక  హోదా  తెస్తా మన్న వాళ్ళు  దాని పై  స్పందన  లేకపోగా  నిశ్చబ్ధం పాటించటం  విచారకరమని"  తెలుగు  దేశం  వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి  తారక రామారావు  గారి అగ్ర  తనయుడు,  మాజీ ఎం.పి,  తెలుగు దేశం పార్టీ నేత  నందమూరి  హరికృష్ణ  ఈ రోజు తన తండ్రి జయంతి సంధర్బంగా  నగరం లోని ఎన్.టి.ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తూ "  ఇంటి  కొక్కడు  ఒక  సైన్యమై  ప్రత్యేక  హోదా కొసం పోరాడాలి" ...అదే ఎన్.టి.ఆర్  కు ఘనమైన  నివాళి  అని  ప్రత్యేక  హోదా  తెస్తా మని  అన్న వాళ్ళు  ఇప్పుడు ఏమి  చేస్తున్నారో తెలియటం లేదని,  మనం అంతా  కలసి ప్రత్యేక హోదా సాధించాలని సకలాంధ్ర ప్రదెశ్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  


తనకు మహానాడు కంటే మహనీయుడైన నందమూరి  తారక రామారావు  గారికి  నివాళి  నర్పించటమే  శ్రేయోదాయకమని  మీడియా కు వివరించారు. మనమంతా  ప్రత్యేక హోదా సాదన కోసం ప్రతిన బూని ఉద్యమం నడిపైనా సాధించాలని నొక్కి చెప్పారు.తెలుగుజాతి  మనుగడ  సాగించినంత కాలం ఎన్.టి.ఆర్. తెలుగు జాతి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని హరికృస్ణ ఉద్ఘాటించారు.


మహానాడుకు హరికృష్ణ వెళ్లకపోవడమే కాకుండా, ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆయన గళంలోని అసమ్మతి స్వరం కూడా గమనించదగిన విషయం.   దీనిని బట్టి హరికృష్ణ అసమ్మతి ద్వజం ఎగరేస్తారా?  ఆయన మౌనంగా ఉన్నారిప్పటి వరకు. ఇప్పుడు ఆయన గళం నుండి అసమ్మతి స్వరం వినిపించటం వెనుక ఎవరున్నారు?  కొందరేమో దిల్లీ  పెద్దలని,  మరికొందరు  జగన్ కావచ్చంటూ అనుమానాస్పదంగా మాట్లాడుకుంటున్నారు.


 అసలు డౌట్ ఏమంటే ఈ మద్య తెలుగు దేశం పార్టీ చొటా నాయకులు కూడా  తమ మిత్రపక్షం  గురించి పదే పదే విమర్శలు చేస్తూ సరిగ్గా  ప్రత్యేక హోదా కోసం కేంద్రం తో  డీల్  చేయలేక పోవ టాన్ని ఆధారం చేసుకొని హరికృష్ణ తో అసమ్మతి  నాగస్వరం వినిపిస్తు న్నారనే  పుకారు షికారు చేస్తుంది.  ఏవరా  అదృశ్య  శక్తి అనేదాని పై తెలుగుదేశం తో చంద్రబాబు తో సఖ్యత చెడిపోతున్న సందర్భం లో బిజెపి రధి సారధి కలసి వేరే ప్లాను రచించటం లేదు కదా?

మరింత సమాచారం తెలుసుకోండి: