ప్రపంచంలో మనిషి దేన్ని నమ్మినా నమ్మకపోయినా దేవుడిని మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు..అయితే కొంత మంది దేవుడు లేడని అన్ని మనిషి కల్పించిన కట్టుకథలే అని కొంత మంది వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా భారత దేశంలో దేవుడంటే పరమ భక్తి ప్రదర్శిస్తారు. ఆ మద్య కొంత మంది దేవుళ్లు పాలు తాగుతున్నట్లు పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మం జిల్లాలోని వైరా మండలం బ్రాహ్మణపల్లి అగ్రహారంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. అగ్రహారంలో ఉన్న అభయాంజనేయస్వామి కంట్లో నుంచి కన్నీటి ధార ప్రవహిస్తోంది.

ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా నిన్న ఆలయ పాలకవర్గం గడువు ముగియడంతో అర్చకులు నిన్న గుడిని మూసివేశారు.  ఇక నేడు  హనుమాన్ జయంతి సందర్భంగా నిన్న ఆలయ శుద్ధికై అర్చకులు ఆలయాన్ని తెరువగా స్వామి కంటి నుంచి నీరు రావడం చూసి ఒక్కసారే షాక్ కి గురయ్యారు.వెంటనే ఈ విషయాన్ని ఆలయ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లారు.

విషయం తెలిసిన గ్రామస్థులు వింతను చూసేందుకు తరలివస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఇక అగ్రహారంలో ఉన్న అభయాంజనేయస్వామి కంటి నుంచి కన్నీరు రావడం చూసి ఊరికి ఏదో అరిష్టం అని భక్తులు అంటున్నారు. గతంలో ఊరిలో జాతర చేయాల్సి ఉన్నా అది ఇప్పటి వరకు చేయకపోవడం వల్లే స్వామివారికి ఇలా జరిగిందని పలువురు భక్తులు అంటున్నారు.  స్వామి కంట నుంచి నీరు రావడం పై భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఇది చుట్టు పక్కల గ్రామాలకు పాకింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: