ఈ మద్య స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతం అయ్యింది..ఒకప్పుడు ధనికులకే అందుబాటులో ఉండే ఈ ఫోన్లు సామాన్య ధరలకు లభ్యం కావడంతో చాలా మంది వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మీ చేతిలో ఉన్నట్లే. అంతే కాదు ఈ ఫోన్లతో మరో సదుపాయం సెల్ఫీ. గతంలో ఎవరితో అయినా ఫోటో దిగాలంటే ఇతరుల సహాయం తీసుకోవాల్సి వచ్చేది..కానీ ఇప్పుడు అలా కాదు ఉన్న చోటే తమకు కావాల్సిన వాటితో కావాల్సిన వారితో సెల్ఫీ దిగే సదుపాయం వచ్చింది. అయితే వీటితో కొన్ని సార్లు ప్రమాదాలు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి..ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫీ మోజులో పడి కొంత మంది యుముడి వద్దకు డైరెక్ట్ గా టికెట్ తీసుకుంటున్నారనే చెప్పాలి.

తాజాగా ఓ యువతి స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చి సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించి తన ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే..రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని నేషనల్ లా యూనివర్శిటీలో ప్రణీత మెహతా (21) విద్యాభ్యాసం చేస్తున్నది. స్నేహితులతో కలిసి లాంగ్ టూర్ వెళ్లారు. ముంబై, గోవా తదితర ప్రాంతాల్లో విహార యాత్ర ముగించుకున్నారు.

గోకర్ణ బీచ్ లో 300 అడుగుల లైట్ హౌస్ పైకిఎక్కి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు సముద్రంలోకి పడిపోయింది. అక్కడే ఉన్న జాలర్లు ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత ఆమె మృతదేహాన్ని సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చారు. మొత్తానికి  ప్రపంచంలో అత్యధికంగా సెల్ఫీ మరణాలు ఇండియాలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: