కెసిఆర్ నాయకత్వంలోని టిఆరెస్ రెండేళ్ళ తెలంగాణా పాలన తరవాత ప్రజల్లో పెల్లు బుకుతున్న కొన్ని సందేహాలు.  వీటికి టిఆరెస్ నాయకత్వం జవాబులు,  వెతుక్కోకుండా చెప్పగలిగితే,  తెలంగాణా రైట్ డైరెక్షన్ లో నడుస్తున్నట్లే.  కెసిఆర్ గారు!  ఈ ప్రజల ప్రశ్నలకు సమాదానం చెపుతారా?

 

*తెలంగాణా రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ ను మరిచారా?   పార్టీ నాయకురాలు సోనియాగాంధి పాదాలను తెలంగాణా ఇచ్చిన సందర్భములో స్పృజించిన మీ కుటుంబం ఆమెకు చెందిన కాంగ్రెసును అంత మొందిస్తున్నారెందుకు?



*మీ కుటుంబ సభ్యులు నలుగురే  తెలంగాణా, తెచ్చారా మరైతే మీరు రాష్ట్రములో;  మీ కుమారు డు కెటిఆర్ విదేశాల్లో, ఎన్నికలలో టిఆరెస్ గెలుపుకు మానేజ్ చేసే పనుల్లో;    మీ మేనల్లుడు హరీష్ మాత్రం మిషన్స్ లో;  మీ కూతురు కవితమ్మ, బతకమ్మ లాంటి అధికారిక పర్వదినా ల్లో....ఎక్కడ చూసినా మీరే అన్నట్లు, మిగతావాళ్ళు మంత్రులు ప్రజా ప్రతినిధులు కారా? మీతో ఉద్యమములో పాల్గొన్న సహచరులు కనిపించట్లేదేమి?  ఇవన్నీ విజ్ఞుల మనసుల్లో ఉదయిస్తున్న ప్రశ్నలు.




*ప్రొఫెసర్ జయ శంకర్గారిని అప్పుడే మరచారేం?  రాష్ట్రావతరణ దినోత్సవాల్లో ఆయన ప్రశక్తి లేదేమి?  కాళోజీ లాంటి తెలంగాణా  ప్రముఖులు, కోదండరాం లాంటి క్రియాశీలుర మాటేమిటి? తెలంగాణా  సాధనలో కొదండరాం పాత్రలేదా?  ఆయన్నెందుకు వదిలేశారు?



*తెలంగాణా విభజనకు కెంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు, టిడిపి సహకారం,  మీరు మరిచారా?  మరవ లేదా? అయితే  చరిత్రను మార్చాలను కుంటున్నారా? న్యాయబద్ధం గా 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిని జాయింటుగా నడపాలన్న నియమం తుంగలో తొక్కి ఏపి ప్రజలను ఉద్యోగులను రకరకాల కిరికిరులతో వేదించట మెందుకు?




*పార్లమెంటులో రాజ్య సభలో తెలంగాణా బిల్ పాస్ అవటానికి కారణమైన బిజేపి ని మీరు రాష్ట్రములో కలుపుకు పోరా?  బిజేపి ఉనికినే సహించరెందుకు? అలాంటప్పుడు మీరు కేంద్రంతో సఖ్యత ఎలాపొందుతారు?


*ఉస్మానియా విద్యార్దులను వారి త్యాగాలను మరిచారా?  రాష్ట్రావతరణములో ఉస్మానియాలో అప్రకటిత ఎమర్గెన్సీ ఎందుకు ప్రకటించారు?  సభలు, సమావేశాలు నిర్వహణపైబాన్”  ఎందుకు?  జనం నోరు మూయటం ద్వారా,  ప్రజాభిప్రాయాన్ని మార్చగలరా?  అలోచనల్ని అణిస్తే మరో ఉద్యమం రూపు దిద్దుకొదా? తెలంగాణా ఉద్యమాన్ని సంగ్రామంగా నడిపించి విజయం సధించిన మీకు తెలియదా?


*బిన్నాభిప్రాయాలు విస్త్రుతంగా ఉండటమే ప్రజాస్వామ్య లక్షణం. మరి వ్యతిరెఖ మీడియా నెందుకు నిర్లక్ష్యం చేస్తారుమీడియా పై మీ దురహంకార వైచిత్రిలో మార్పు రాలేదెందుకుఇష్టంలేదాపరుల విమర్శలు వద్దు కాని - మీ స్వంత మీడియాలో స్వకుచ మర్ధనం మీకు సంతృప్తి నిస్తుందా? అయితే మీకు గతములోని టిడిపి - కాంగ్రెస్లకు తేడా ఏమిటి, మీ స్వంత మీడియాలో విపరీత ప్రభుత్వానుకూల ప్రచారాలెందుకుప్రజాధనంతో ప్రజలకిచ్చే సంక్షేమాన్ని “కెసిఆర్ ఇస్తున్నట్లు”  ప్రచారం చేయటం ఎందుకు?


*సచివాలయాన్ని కూల్చటమెందుకు?  వాస్తు కోసమా? వాస్తును అధికారంగా శాస్త్రీయమని శాసనసభలో ప్రకటిం చండి.  వందల కోట్ల ప్రజాధనం దుబారాదేనికి?  కొత్త సచివా లయములో నిర్మాణ్స కాంట్రాక్టు ఏవరికిచ్చారు? మీ తస్మదీయులకా?  లెదా మీ బందువులకా? భవనాల నిర్మాణం మాత్రమే హైదరాబాదును విశ్వనగరం చేయలేవు. సుపరిపాలన జరగటం లేదంటే మీకు ఆగ్రహ మెందుకు?


*హైదరాబాద్లో లక్ష గృహాల నిర్మాణానికి ఆర్ధిక వనరులేవి? బడ్జెట్ దాన్ని ప్రస్పుటించదెండుకుతెలంగాణాలో మీకు హైదరాబాద్ ఒక్కటే కనిపిస్తుందా? గ్రామీణ కరువు కాటకాలకు తరుణో పాయ ప్రతిపాదనలు,  వనరులేవి?


*మిషన్ భగీరధ విషయములో యిచ్చిన మాటకు చేస్తున్న పనికి పొంతన లేదేమిటి?  మాటలు చేతల్లో కనిపించట్లేదు, కథ ఏమిటి?  అక్రమాలున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. అందుకే వారిని శాసనసభ లో అంతమొందించారా?  అసలు ప్రతి పక్షమే లేకుండా చేయాలను కోవటం ప్రజాస్వామ్య సాంప్రదాయమామిషన్ కాకతీయ ను చెరువుల పూడికల్లో కలిపేశారా? అందులో అవినీతి ఆరోపణలను తప్పని సాకారాత్మకం గా ఋజువు చెయ్యలేరా?


*నూరు శాతం రాజకీయ అవినీతి నిర్మూలన జరిగిందన్న మీమాటల్లో నిజమెంత? 25 మంది  టిఆరెస్ గుండా ఎం.ఎల్. వసూళ్ళ మాటేమిటి?  రౌడీ ఎం.ఎల్.ఏ ల పై ఇంటెలిజెన్స్ రహస్య నివేదికపై మీ “ఏటిఆర్”  ప్రజలకు చెప్పరా?  వాళ్ళపై చర్యలేవి?  వాళ్ళ లీలలు టివిల్లో ప్రజ లంతా వీక్షించారు ?  సర్వత్రా అవినీతి అలుముకొని ఉన్నా మీకది కనిపించలేదా?


*ఆకాశం లో సగమైన మహిళలకు అవకాశా ల్లో సగం వాటా మీరెందు కివ్వరు? మహిళంటే మీ కూతురు కవిత ఒక్కరేనా? తెలంగాణాలో మహిళలు సమర్ధులు కారా? కవితమాత్రం రాజకీయం తెలిసిన తెలంగాణా మహిళా విద్యావంతులు మీకు దొరకలేదా?  ప్రతిపక్షసభ్యుల్లో కూడా తగిన మహిళా సభ్యులలో కూడా మంత్రులు కాదగిన వారు మీకు కనిపించలేదా?


*మీరు మీ కార్యాలయాన్ని కొండంత దూరంలో ఉంచి అధికారులను మీ ఇంటి చుట్టు తిప్పు కోవటం దుబారా వ్యయం, కాలయాపన, నైపుణ్యం వృధాకాదా? మరైతే హైదరాబాద్ సిఎం కాంపు ఆఫీస్ ఎందుకు.


*”ఓట్ కు నోట్”  కేసును ఎందుకు చురుకుగా విచారించరు? నేరస్తులందరిని జైలుకెందుకు పంపరు?  బ్లాక్-మెయిల్ రాజకీయాలెందుకు?



* గ్రామీణ గృహ నిర్మాణాల కోసం మీ మానిఫేస్టోలో ప్రకటించిన విధంగా పురోగతి కనిపించడేమిరాష్ట్రమంతా కరవు అలుముకొని రైతు ఆత్మహత్యలు సర్వ సాధారణ మైన తరుణములో మీ ప్రజా సంక్షేమం పై ఇంత ప్రచారం అవసరమా?  కరువు కాటకాలతో బీటలు వారి తాగు నీరు, సాగునీరు, ఆదాయ వనరులు లేక దొక్కలు మాడి, ఎండుతూ అలమటిస్తున్న "జన తెలంగాణా"  ని వదలి "మహానగరం హైదరాబాద్"  చుట్టు మీరు చేసేదేముంది? రియల్ ఎస్టేట్ వ్యాపారమా? దాన్ని తెలంగాణా ప్రజలెన్నడూ కోరలేదే-ఆంధ్రా వాళ్ళను, వాళ్ళ పొడగిట్టని,  మనం వారి కార్పోరేట్లకే ప్రయోజనం చేకూర్చే పనులు, తస్మదీయులకు కాంట్రాక్టులు కట్టపెడుతూ నడిపించే మీ పాలనలో నైజాం, భూస్వామ్య, అణచివేతల ఆంధ్రా వలస పాలన కనిపించట్లేదా? ఇలా  ముందుకు పోతే మరల ప్రజల్లో నక్సల్బరీ, మావోయిష్టు అలోచనలు ప్రోది చేసుకోవా? 

 

*గ్రామీణ తెలంగాణాలో నెర్రెలు విచ్చి బీడులైన భూములు, మాడుతున్న పశువుల డొక్కలు, నీరులేక బిందెడు నీళ్ళకు అలమటిస్తున్న-  కడుపు డొక్కల్లో కలసిన చిద్రమైన జన జీవనం కనిపించదా?


*80 కోట్ల రూపాయలకు పైగా మన రాష్ట్రావరణ దినోత్సవాల ప్రచారానికి ఖర్చుపెట్టినట్లు వార్తలున్నాయి. ఇదే నిజమైతే దుబారా దేనికి? 80 కోట్లలో మీ టి చానలుకు, నమస్తే తెలంగాణా కు 12 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చినట్లు వస్తున్న వార్తలు నిజమా?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: