ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్... ప్రారంభమైంది. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా సౌదీ అరేబియాలోని మక్కా మసీదు వద్ద నెలవంక దర్శనమివ్వడంతో ఆ మసీదు మత పెద్దలు అదేశాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్ మాసం నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మహ్మదీయ సోదరులు పవిత్ర మాసానికి సంబంధించి ఉపవాస దీక్షలు కూడా మొదలైపోయాయి. రంజాన్ మాసం ప్రారంభానికి సూచకంగా నెలవంక దర్శనం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ముస్లిం సోదరులకు నిన్న సౌదీ అరేబియాలో ఆ నెలవంక కనిపించేసింది.  

నెల రోజుల పాటు పవిత్ర ఉపవాస దీక్షలను ఆచరించనున్న ముస్లింలు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తరువాత మాత్రమే భుజిస్తారు. మంచి నీళ్లు సైతం తాగకుండా అత్యంత భక్తిశ్రద్దలతో ముస్లింలు ఈ రంజాన్ పండుగను చేసుకుంటారు. ఈ సందర్భంగా  ప్రార్థనలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు గంటపాటు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ముస్లిం ఉపాధ్యాయులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈ వెలుసుబాటు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది. ఈ నెలపాటు కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేస్తున్న వీరంతా నిత్యం సాయంత్రం 4 గంటలకు ప్రార్థనల నిమిత్తం ఇండ్లకు వెళ్లిపోవచ్చని స్పష్టంచేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: