ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని తణుకు జాతీయ రహదారి వెంబడి వర్షంతో పాటు చేపలు కూడా పడ్డాయి. వర్షంతో  
సాధరణంగా ప్రకృతి కొన్ని కొన్ని వింతలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని చోట్ల వర్షాకాలంలో చేపల వాన పడటం గమనిస్తుంటాం. వాస్తవానికి చేపల వర్షం అనేది ఉండదు..అసలు దాని వెనుక రహస్యం ఏంటంటే..పెద్ద పెద్ద సుడిగుండాలు చెరువులపై నుంచి సముద్రంపై నుంచి వెళ్లడంతో అక్కడ ఉన్న చాపలు గాల్లో కలిసిపోతుంటాయి..అవి కాస్త వర్షం పడినపుడు భూమిపై పడుతుంటాయని శాస్త్రజ్ఞులు ఇప్పటికే పలుమార్లు చెప్పారు.

గత సంవత్సరం కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో చాపల వాన కురిసిందని పెద్ద హడావుడి చేశారు. తాజాగా ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని తణుకు జాతీయ రహదారి వెంబడి వర్షంతో పాటు చేపలు కూడా పడ్డాయి. వర్షంతో పాటు చేపలు పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.  ఈ చేపలన్నీ తినేందుకు అనువుగా ఉండడంతో వాటిని సేకరించుకునేందుకు స్థానికులు రోడ్లపైకి వచ్చారు. ఒక్కో చేప సుమారు అరకిలో నుంచి మూడు కేజీల వరకు బరువు ఉన్నదని స్థానికులు పేర్కొన్నారు. గతంలో తమ ప్రాంతంలో ఇలా చేపల వర్షం పడిన దాఖలాలు లేవని పలువురు పేర్కొన్నారు. గత ఏడాది కృష్ణా జిల్లా నందిగామలో, ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలతోపాటు చేపలు కురిసిన విషయం తెలిసిందే.

శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం, కుప్పలు తెప్పలుగా పడ్డ వైనం పాతపట్నం శివారు ప్రాంతాల్లోని పొలాల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న చేపలను చూసిన రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వాటిని ఇంటికి తీసుకెళ్లారు. చేపల వర్షంపై వాతావరణశాఖ అధికారులు స్పందిస్తూ.. ఇది సర్వసాధారణమేనని, ప్రపంచంలో అనేక దేశాల తీర ప్రాంతాలలో చేపల వర్షం కురవడం మామూలేనని అధికారులు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: