తెలంగాణ లో టీఆర్ఎఎస్ అనంత‌రం మంచి ప‌ట్టున్న నాయ‌క‌త్వం ఏమీటంటే.. దాదాపుగా తెలంగాణ పొలిటిక‌ల్ జేఏసీ అనే చెప్పుకోవాలి. గ‌త మళిద‌శ ఉద్య‌మం లో జేఏసీ పాత్ర చరిత్ర‌లో లిఖించద‌గిన‌ది. అయితే రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం  ఉద్య‌మ శ‌క్తిగా ఉన్న టీఆర్ఎస్ రాజ‌కీయ శ‌క్తిగా రూపాంత‌రం చెంది అధికారం లోకి వ‌చ్చింది. దాదాపుగా తెలంగాణ లో ఉన్న కొన్ని ఉద్య‌మ‌శ‌క్తులు, అన్ని రాజ‌కీయ పార్టీలు గులాబీ దళం లో విలీనం అయ్యాయి. ఇక జేఏసీ కూడా టీఆర్ఎస్ పార్టీలో విలీనం త‌ప్ప‌ద‌ని అంద‌రూ భావించినా... జేఏసీ చైర్మ‌న్ ప్రొ. కోదండరామ్ ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హారించారు. జేఏసీ ని ప్రజా పక్షం ఉంటునే పోరాడుతామే త‌ప్ప రాజకీయ‌శ‌క్తి గా ఏదిగే ప్ర‌స‌క్తేలేద‌ని తేల్చి చెప్పారు. ఇప్పుడు గులాబీ ద‌ళాన్నీ ధీటుగా ప్ర‌శ్నించే శక్తి ఏద‌న్నా ఉందంటే అది జేఏసీ అనే చెప్పాలి. అయితే రాష్ట్రం ఏర్పాటు అయిన త‌రువాత అడ‌పా ద‌డ‌పా త‌ప్ప, దాదాపుగా సైలెంట్ అయ్యిపోయింది. ఇక జేఏసీ శ‌కం ముగిసింద‌ని అంద‌రూ భావించారు. కానీ తాజా గా గులాబీ సీఎం కేసీఆర్ పై కోదండ‌రాం ఓ రెంజ్ లో ఫైరయ్యారు. 


కేసీఆర్, కోదండ‌రామ్ క‌లిసి ప‌నిచేశారు....

రెండేళ్లు గా కేసీఆర్ పాల‌న పై విసుగు చెందిన ప్ర‌జ‌ల్లో నూత‌న ఉత్స‌హాన్ని నింపింది జేఏసీ. ఏకంగా కేసీఆర్ ను పట్టుకుని చేత‌కాక పోతే త‌ప్పుకొండి,  మేం పాలించి చూపిస్తామ‌ని విమ‌ర్శాస్త్రాలు సంధించారు.  రెండేళ్ళ కేసీఆర్ స‌ర్కార్ పాల‌న త‌మ‌కు తీవ్ర అసంతృప్తి ని క‌లిగిస్తోంద‌ని, చేత‌కాకుంటే, త‌ప్పుకోవాల‌ని, అభివృద్దిని తాము చేసి చూపిస్తామ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు బాగుండాల‌న్న కార‌ణంగానే జేఏసీ ఇంకా ప‌నిచేస్తోంద‌ని, లేకుంటే ఎప్పుడో టీఆర్ఎస్ లో జేఏసీ ని క‌లిపి ఉండేవార‌మ‌ని అన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ కోదండ‌రాం క‌లిసి పనిచేశారు. అయితే పార్టీల‌క‌తీతంగా అన్న పేరు కోసం తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, అప్ప‌ట్లో వ్యూహాత్మ‌కంగా కోదండామ్ ని తెర‌పైకి తీసుకొచ్చార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి అత్యంత సన్నిహితుడైన కోంద‌డ‌రామ్ రెడ్డి ని కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో నాయ‌కుడిగా నిల‌బెట్టారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ వ్యూహాం ఫ‌లించింది. తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండరామ్ చెల‌రేగిపోయారు. 


కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే జేఏసీనిర్ణ‌యాలు....
 
కోదండ‌రామ్ పోలిటిక‌ల్ జేఏసీ ఏర్పాటు అనంత‌రం అన్ని రాజ‌కీయ పార్టీలూ జెండాల‌ను ప‌క్క‌న పెట్ట‌క తప్ప‌లేదు. వివిధ పార్టీలు జేఏసీ పిలుపు తో క‌లిసి న‌డిచాయి.  కొంత కాలంగా జేఏసీ కీల‌క నిర్ణ‌యాల‌న్నీ కేసీఆర్ క‌నుస‌న్న ల్లోనే జ‌రిగేవి. అనంత‌రం ఇద్ద‌రి మ‌ధ్య కొంత విభేదాలు ఏర్పాడ్డాయని ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఇక జేఏసీ ఉద్య‌మంలో త‌మ స్వంత నిర్ణ‌యాలు, ఉద్య‌మ పంథాల‌ను టీఆర్ఎస్ కు భిన్నంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ వ‌చ్చింది. ప్రొఫెసర్ కోదండ‌రాం చైర్మ‌న్ గ‌నుక‌, ఆయ‌న మాట‌ల‌కి టీడీపీ నేత‌లు,  కాంగ్రెస్ నేత‌లు, బీజేపీ నేత‌లు వామ‌ప‌క్షాల‌కు చెందిన నేత‌లు, ఇత‌ర ప్ర‌జా సంఘాలు ఉద్య‌మ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అన్ని ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగ సంఘాలు ఇలా మొత్తంగా తెలంగాణ స‌మాజం జేఏసీ పిలుపుకు విలువ ఇచ్చాయి. ఓ ద‌శ‌లో కోదండ‌రామ్, కేసీఆర్ ని మించిపోయారు ఫాలోయింగ్ లో, త‌న‌దైన నిర్ణ‌యాల‌తో తెలంగాణ ఉద్య‌మాన్ని హోరెత్తించారు. కొన్ని సంధ‌ర్బాల‌లో జేఏసీ పిలుపును టీఆర్ఎస్ పార్టీ సైతం వినాల్సి వ‌చ్చింది. సాగ‌ర‌హారం, స‌క‌ల జ‌నుల స‌మ్మె లాంటి ఉద్య‌మ పంథాలు జేఏసీ ఇచ్చిన పిలుపులే. వీటి లో టీఆర్ఎస్ పార్టీకి ఏలాంటి సంబంధ లేదు. కానీ అప్ప‌టి స‌మ‌యంలో టీఆర్ఎస్ కు సైతం త‌ప్ప‌లేదు.

కోదండ‌రామ్ ను  హ‌ద్దులు దాట‌కుండా క‌ట్ట‌డి చేసిన కేసీఆర్...

ఇక చేసేది ఏమీలేక, జేఏసీ పిలుపుకు మ‌ద్ద‌తునిస్తూ జేఏసీ  తో ముందుకు సాగింది గులాబీ ద‌ళం. దాంతో కేసీఆర్ కి చిరాకేసింది. తెలంగాణ జేఏసీ నుంచి కోదండ‌రామ్ ని పీకి పారెయ్యాల‌నుకున్నారు. కానీ, కుదిరే ప‌ని కాదు. అందుకే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హారించారు. అప్పుడ‌ప్పుడూ మొట్టికాయ‌లేస్తూ, కోదండ‌రామ్ హ‌ద్దులు దాట‌కుండా క‌ట్ట‌డి చేశారు. తెలంగాణ గ‌జిటెడ్ ఆఫీస‌ర్స్ ఆసోసియేష‌న్. నాన్ గ‌జిటెడ్ ఆపీస‌ర్స్ ఆసోసియేష‌న్, ఆర్టీసీ ఎంప్లాయిస్ అసోసియేష‌న్, తెలంగాణ రైల్వే జేఏసీ, ప్ర‌తి గ్రామ గ్రామాన, మండలాల్లో, జిల్లాల్లో ఇలా యావ‌త్ తెలంగాణ ప్రాంతంలో జేఏసీ ఉద్య‌మం ఉదృతం చేసింది. తెలంగాణ ఉద్య‌మం క‌ల సాకార‌మ‌య్యింది. తెలంగాణ స‌మాజం సంబ‌రాలు చేసుకుంది. అప్ప‌టి నుంచీ, కోదండ‌రామ్  కి అనునిత్యం కాళ‌రాత్రే అయ్యింది. నూత‌న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి గా టీఆర్ఎస్ ఆధినేత కే. చంద్ర‌శేఖ‌ర్ రావు మొద‌టి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.  జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం కి క‌నీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌లేదు. కేసీఆర్ కోదండ‌రామ్ ని తెలంగాణ ఉద్య‌మంలో వాడుకుని, ఆయ‌న నంటే ఏ పార్టీకీ గిట్టిని విధంగా మార్చేశారు. కోదండ‌రామ్ ను జానా రెడ్డి ప‌ట్టించుకోలేదు. ఇంకెవ‌రూ లెక్క చేయ‌లేదు. 


గులాబీ సీఎం పై కోదండ‌రాం ఎటాక్....

ఇక ఉపేక్షించేది లేద‌ని భావించిన కోదండ‌రామ్ స‌మ‌యం కోసం వేచి చూశారు. రెండేళ్ళ పాల‌న పూర్తైన స‌మ‌యంలో ఒక్క‌సారిగా త‌న నోటికి మ‌రోసారి ప‌నిచెప్పారు. జ‌నం కోసం తెలంగాణ జేఏసీ పనిచేస్తుంద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం తో ఇంకా బాగా పనిచేయించేందుకు జేఏసీ ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. ఇదే అదునుగా ఒక్క‌సారి గులాబీ సీఎం పై అటాక్ మొద‌లు పెట్టారు కోదండ‌రామ్. చేత‌కాక‌పోతే దిగిపో అంటూ తెలంగాణ ముఖ్య‌మంత్రి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసేశారు. అంతే, ఒక్క‌సారిగా టీఆర్ఎస్ నేత‌లు చెల‌రేగిపోయారు. అప్ప‌టి దాకా, పార్టీ శ్రేణుల్ని కోదండ‌రామ విష‌యంలో సంయ‌మనం పాటించాల‌ని సూచించిన కేసీఆర్... ఇప్పుడు వారంద‌రినీ కోదండ‌రామ్ పైకి ఉసిగొల్పారు. నిన్న మొన్న‌టి దాకా తెలంగాణ లో కోదండ‌రామ్ కి పాజిటివ్ గానీ, నెగెటివ్ గానీ, పబ్లిసిటీ ద‌క్క‌కూడ‌ద‌నుకున్న కేసీఆర్, ఇప్పుడు త‌న మీద‌కే కోదండరామ్  దూసుకోస్తుండ‌టం స‌హించ‌లేక‌పోయారు. పబ్లిసిటీ కాదిక్క‌డ మేట‌ర్, త‌న ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్న కోదండరామ్ దెబ్బ‌కొట్టేందుకు పార్టీ శ్రేణుల్ని ఉసిగొల్పారు. ఇక్క‌డ, కేసీఆర్ క‌న్నా కోదండ‌రామ్ స్కెచ్  అదుర్స్ అనేలా ఉంద‌న్న‌ది నిర్వివాదాంశం.

కేసీఆర్ అనంత‌రం ఉద్య‌మ నాయకుడిగా కోదండ‌రామ్ పేరుంది...

ఇప్పుడు కేసీఆర్ , త‌నలోని అస‌లు కోణాన్ని బ‌య‌ట‌పెట్టారు. అది కోదండరామ్ వ్యాఖ్య‌ల పుణ్య‌మే. తెలంగాణ ఉద్య‌మంలో నన్ను వాడుకుని, ఇప్పుడిలా నన్ను తిట్టిస్తున్నారంటూ కోదండరామ్ విమర్శ‌నాస్త్రాలు సంధించారు. చేత‌నైతే ఏదో ఒక పార్టీలో చేరి, కేసీఆర్ ని విమ‌ర్శించ‌మ‌ని టీఆర్ఎస్ నేత‌లు కోదండరాం కి ఉచిత స‌ల‌హా ఇస్తూ ఎద్దేశా చేయ‌డం గ‌మ‌నార్హం. వాస్తవానికి తెలంగాణ‌లో కేసీఆర్ త‌రువాత ఉద్య‌మ నాయకుడిగా  మంచి పేరున్న నాయకుడంటే దాదాపుగా జేఏసీ నేత  కోదండ‌రామ్ కే ద‌క్కుతుంది. ఆయ‌న ఉద్య‌మ కాలంలో గులాబీ నేత మించిన క్రేజ్ పెంచుకున్నారు.  ఇప్ప‌టి కిప్పుడు గులాబీ నేత పై విమ‌ర్శించే ద‌మ్ము ధైర్యం ఎవ‌రికి లేదు. దీనికి స‌మ‌ర్ధుడైన నేత కోదండరామే న‌ని చెప్పక త‌ప్ప‌దు. అంటే దాదాపుగా కోదండ‌రామ్ ఫైర్ తో గులాబీ ద‌ళానికి గట్టి దెబ్బ  త‌గ‌లక త‌ప్ప‌దు...! 
 


మరింత సమాచారం తెలుసుకోండి: