హైదరాబాద్‌లో చైన్ సాచ‌ర్లు రెచ్చిపోతున్నారు. న‌గ‌లు వేసుకొని బ‌య‌టికి రావాలంటే మ‌హిళ‌లు వ‌ణికిపోతున్నారు. ఒంట‌రి మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచ‌ర్లు రెచ్చిపోతున్నారు. హైద‌రాబాద్‌లో 24గంట‌ల్లో ఆరు చోట్ల చైన్ స్నాచింగ్‌లు జ‌రిగాయి. క‌ర్మాన్ ఘాట్‌, బోయిగూడ‌, తుకారం గేట్‌, గోపాల‌పురంలో ఒంట‌రిగా వెళుతోన్న మ‌హిళ‌ల మెడ‌లోంచి చైన్ల‌ను లాక్కెళ్లారు. 
Related Image
ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని చైన్‌స్నాచర్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బుధవారం జరిగిన చైన్‌స్నాచింగ్ ఘటన మరవకముందే గురువారం ఉదయం తుకారాం పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో చైన్‌స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ ప‌రిధిలో షాపులో ఉన్న మ‌హిళ నుంచి కూడా దుండ‌గులు గొలుసు లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు స్నాచ‌ర్ల ఊహా చిత్రాల‌ను విడుద‌ల చేశారు. చైన్ స్నాచ‌ర్ల కోసం ప్ర‌త్యేక గాలింపు బృందాలు రంగంలోకి దిగాయి.తుకారాంగేట్‌, మహంకాళి పీఎస్‌ పరిధిలో రెండు చోట్ల, అడ్డగుట్ట, కర్మాన్‌ఘాట్‌, బోయిగూడలలో చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. దీంతో ఒంటరిగా నడిచి వెళ్లాలంటేనే మహిళలు జంకుతున్నారు.


అడ్డగుట్టలోని కిరాణా షాపులో సరుకులు ఇస్తున్న లక్ష్మి అనే మహిళ మెడలోని గొలుసును గుర్తు తెలియని దుండగులు తెంచుకుని వెళ్లారు. బాధితురాలు తుకారాం గేట్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు మహిళ మెడలో ఉన్నది నకిలీ బంగారం గొలుసు అని లక్ష్మి పోలీసులకు వెల్లడించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: