దీనిని విస్తార పరిస్తే  కాపు  సామాజిక వర్గానికి తానే ఏకైక నాయకుడు కావాలని, తనవెనుకే తన జాతి నడవాలని, ఈ ఐఖ్యతతో, బలమైన కమ్మ అధికార తెలుగుదేశం నాయకుడు, రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుణ్ణి రాజకీయంగా బెదిరించి తన జాతి (ఆయన కాపులను అలా చెపుతారు-జాతి అంటే అర్ధం వేరు)  సంఖ్యాబలంతో తన (మ)  పనులు చేయించుకోవాలన్నది “ఆయన  మనసులో మాట” ని,  తన మన సెరిగిన వారు చెపుతారు.  ఆ స్థాయి కి తన కులం ఇప్పటికే  ఎదిగి పోయింది.



 

కాపు కులం ఓట్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడబట్టే కదా!

వారిని వెనుకబడిన తరగతుల జాబితాలో చేరుస్తానని,

వారి సంక్షేమం కోసం ఆర్ధిక సహాయం చేయటం,

దానికి ఒక కమీషన్ వేయటం ...



 

ఇదంతా ఇప్పటివరకు ఆర్ధికంగా, రాజకీయముగా మట్టిలో కలిసిన ముద్రగడ,….మాణిక్య మై ఉవ్వెత్తున ఎగసి పడి ఆయన  దీక్షకు  స్పందిన  కాపు యువజాతి తుని రైల్వె స్టేషన్లో ఆగిఉన్న రత్నాచల్ ఎక్స్-ప్రెస్ దహనం చేయటం, పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను 40 కోట్ల రూపాయల విలువైన విద్వంసం చేసారు. ఇంత ప్రజాధనం హరించుకు పోవటం  ఈ నష్టానికి భాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాల్సిన శిక్షార్హులెవరు? భాధ్యత మరచి సాధ్యంకాని హామీ లిచ్చిన చంద్రబాబా?  లేక  “కాపుల పై తన ముద్ర” వేసి స్వార్ధం కోసం కాపు జాతి నాయకుడు గా ఎదిగిన  ముద్రగడ   పద్మనాభమా?




ఈ నష్టాన్ని పైసా వసూల్ పద్దతి లో ఎవరి వద్ద వసూల్ చేయాలి? మద్య తరగతి ప్రజలు, (ఉన్నతవర్గాల వారికి బాబు అనేక రకాలుగా సహాయం చేస్తున్నారు,  కింది తరగతుల వారికిఅనే క  సంక్షేమ పదకాలు పంచుతున్నారు కదా! బాబు - ఇక అన్యాయమయ్యేది మద్య తరగతే కదా!)  ఉద్యోగులు కట్టిన పన్నుల నుండి కాకుండా - నష్టం కలిగించిన వ్యక్తులనుండి వారి ఆస్తులను జప్తుచేసైనా, వారిని అరస్టు చేసైనా సరే వసూల్ చేయాలి. బాబు కది సాద్యమా? ఇప్పటికే వారిని విడుదల చేయించి పైచేయి సాధించిన ముద్రగడను బాబేమీ పీకలేరు. అది నిశ్చయం.



 

ఈ సమాజములో ఎస్.సి లకు, ఎస్.టి లకు, బి.సి లకు, మైనారిటీలకు, వికలాంగులకు, క్రీడాకారులకు, ఎక్స్-సర్వీస్ పర్సన్స్ కు 50% కు పైబడి 60% కు దిగువన ఉన్న రిజర్వేషన్లు ఇంకా విస్తరిస్తే మిగిలేదెవరు? పూర్వ అగ్రవర్ణాల వారా? ఆధునిక ఉన్నత తరగతులైన కమ్మ, రెడ్ది, వెలమ, కాపు తదాదిగా ఉన్న  కొద్ది శాతం ప్రజలా? ఇందులో కమ్మ, రెడ్డి, వెలమ, కాపులు, రాజులు ఇప్పటికే రాజకీయాధికారం వెలగబెడుతూ సంపదలు కూడబెట్టుకున్నారు కదా?


 


కులాల కుంపట్ల ప్రకారం మిగిలింది బ్రహ్మణ, వైశ్యులే కదా? వారీ రిజర్వేషన్ కేకుకు ఎందుకు అర్హులు కాదో ? ఈ రాజకీయనాయకులు తేల్చాలి. లేదా ఆర్ధికస్థితి గతులను బేరీజు వేసి ఆర్ధిక వెసులుబాటుపై మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలి.  చంద్రబాబు ఇప్పటికే నిప్పులో కాలేశారు ముద్రగడను దగ్గరకు తీసి. ఖచ్చితం గా ఈ విషయం బాబు రాజకీయ జీవితములో నిప్పులు పోయటం ఖాయం. ముద్రగడ తనపై కాపుజాతి ముద్ర వేసుకోవటానికి చేసిన రగడే తప్ప - తనూ ఆజాతిని మోసంచేసినవాడిగా మిగిలిపోతాడు తప్ప ఈ(అ)రాజకీయ నాయకులవల్ల జాతికి ఒరిగేదేమీ లేదు. కాని ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: