కృష్ణానది జలాల్లో వాటాలపై కేంద్ర జనవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శితో తెలంగాణ, ఏపీ ఇరిగేషన్‌శాఖ మంత్రులు హరీష్‌రావు, దేవినేని ఉమలు నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. నేడు జరిగిన చర్చల్లో సైతం ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై ప్రతిష్టంభన తొలగలేదు. ఎలాంటి అభిప్రాయానికి రాకుండానే సమావేశం ముగిసింది. దీంతో ఇరురాష్ర్టాలు చర్చించుకునేందుకు కేంద్రం నవంబర్ 1వ తేదీ వరకు సమయం ఇచ్చింది. కాగా కేంద్రం నిర్ణయాన్ని ఏపీ వ్యతిరేకించింది.


అదేవిధంగా నాగార్జునసాగర్ కుడికాలువ గేట్లు తామే నిర్వహిస్తామన్న ఏపీ తీరును తెలంగాణ వ్యతిరేకించింది. ఇరు రాష్ర్టాల మధ్య జరిగే నీటి పంపకాలపై కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని కేంద్రం పేర్కొంది. సమావేశంలో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు సమసిపోయేందుకు మరింత మేర చర్చలు జరగాల్సి ఉందన్న భావనతో 3-4 నెలల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని కేంద్ర జలనవరుల శాఖ ఉన్నతాధికారి అమర్ జిత్ సింగ్ ప్రతిపాదించారు. 



దీనికి హరీశ్ రావు సరేనన్నా, దేవినేని ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు... దేవినేని వైఖరిపై నిప్పులు చెరిగారు. కేంద్రం ప్రతిపాదనకు తాము సరేనన్నా... మొండి వైఖరితో వ్యవహరించిన ఏపీ ఆ ప్రతిపాదనకు ససేమిరా అన్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: