తెలంగాణ అంశం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో 'తెలంగాణ వాదంలో 101 అబద్దాలు' అంటూ ఓ పుస్తకాన్ని విశాలాంధ్ర మహాసభ ఆవిష్కరించింది. తెలంగాణ డిమాండ్ సరైంది కాదని చెబుతున్న ఈ పుస్తకానికి 'రెప్యూటింగ్ యాన్ ఏజిటేషన్.. ఒన్నాట్ వన్ లైస్ అండ్ డుబియస్ ఆర్గ్యూమెంట్స్ ఆఫ్ సపరేటిస్ట్స్'.. అనే టైటిల్ పెట్టారు. తెలంగాణ వాదులు తమకు అన్యాయం జరుగుతుందని చెబుతున్న 101 ఆరోపణల్ని తాము గుర్తించామని విశాలాంధ్ర ప్రతినిధులు తెలిపారు. వాటికి 4 అంశాలుగా వర్గీకరించి సమాధానాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అందులో చరిత్ర. ఆర్థిక, రాజకీయ, భాష-సంస్కృతికి సంబంధించిన నాలుగు అంశాలుగా ఉన్నాయన్నారు. తెలంగాణ వాదుల ఆరోపణలన్నిటినీ పరిశీలించామని వాటిలో నిజమెంతో తేల్చే ప్రయత్నం చేశామన్నారు. ఈ సందర్భంగా పుస్తకావిష్కరణలో పాల్గొన్న ప్రధానమంత్రి మాజీ సలహాదారు సంజయ్ బారు మాట్లాడుతూ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ అందిరికీ ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: