గుజరాత్‌లో దళితులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన వైనంపై లోక్‌సభలో వాడీ వేడిగా చర్చలు జరిగాయి.  ఇక ఇంత రగడ జరుతున్న ఆ సమయంలో మాత్రం ఏఐసిసి ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కాస్త కునుకు తీయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది.  వివరాల్లోకి వెళితే గుజరాత్‌లో దళితులు చేస్తున్న ఆందోళనపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం లోక్‌సభలో మాట్లాడారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత‌లు సహా ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌తో క‌లిసి తీవ్రంగా ఈ అంశంపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు. బిజెపి అదికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని కాంగ్రెస్ నేత మల్లి ఖార్జున ఖర్గే విమర్శించగా, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ ఖండించి, గుజరాత్ ఘటనను ప్రదాని మోడీ కూడా ఖండించారని తెలిపారు.

కాంగ్రెస్,బిఎస్పి లు దీనిపై తీవ్ర నిరసన తెలిపాయి. ఇదే సమయంలో కెమెరాలు ఆయన పక్కనే ఉన్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడి వైపుకి మళ్లాయి. దీంతో  రాహుల్ గాంధీ మరోసారి లోక్సభలో కనుకు తీస్తూ కెమెరాకు చిక్కారు. . దళితులపై దాడి చర్చ రాహుల్కు మరి లాలిపాటలా అనిపించిందో గానీ కాంగ్రెస్‌ ఎంపీలు ఆయనను నిద్ర నుంచి మేల్కొలిపే ప్రయత్నం కూడా చేయలేదు. సోమనాద్ జిల్లా ఉణ అనే పట్టణంలో ముగ్గరు దళితులు చనిపోయిన ఆవు తోలును తీసుకువెళుతుండగా,కొందరు గోరక్షకుల పేరుతో వారిని పట్టుకుని కట్టివేసి తీవ్రంగా కొట్టిన ఘటన వీడీయో సోషల్ మీడియాలో వైరల్ గా వ్యాపించింది.

ఇప్పుడు ఇది కాస్త బీజేపీ నేతలకు ఛాన్స్ దొరకడంతో కాంగ్రెస్ యువనేతపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు. లోక్సభలో కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో నిద్రలోకి ఎలా జారుకుంటారని ప్రశ్నించారు. గత పదేళ్ళు పడుకున్న కాంగ్రెస్ నేతకు ఇంకా నిద్ర సరిపోలేదా? అంటూ సెటైర్లు వేశారు.  మరోవైపు  మీడియాలోనూ రాహుల్ నిద్రపోతున్న దృశ్యాలు హాట్ టాపిక్ గా మారాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: