ఏ పనైనా సులభంగా కావాలంటే.. ఏ పనైనా కష్టంగా ఫీలవుతుంటే.. అందులో లేడీస్ కు అవకాశం కల్పించే చాలట. ఎంత కష్టమైన పనైనా సులభంగా తేలిపోతుందట. ఈ మాట మేం చెబుతున్నది కాదండోయ్. ఓ పరిశోధన సంస్థ శాస్త్రీయంగా పరిశోధన చేసి మరీ తేల్చి చెప్పింది. 

నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, నిర్ణయాలు తీసుకోవడంలో తోటివారికి సాయపడటం వంటి అంశాల్లో స్త్రీలు చాలా మెరుగైన ప్రతిభ చూపుతారట. ఒక నిర్ణయం తీసుకునే అంశంలో ఇద్దరు మగాళ్లు ఉన్నట్లయితే ఒకరిపై మరొకరు తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకే మొగ్గు చూపుతారట. మగాళ్లైతే రాజీకి వచ్చేందుకు ఓ పట్టాన ఒప్పుకోరట. 


అదే సమయంలో ఇద్దరు మహిళల జోక్యం ఉన్నట్లయితే ప్రతిసారీ రాజీ కుదురుతుందట.  అమెరికాలోని కరోల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన హృష్టిన నికోలొవ తమ పరిశోదన వివరాలను మీడయాకు తెలిపారు. అమెరికాలోని రెండు విశ్వవిద్యాలయాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులపై ప్రయోగాలు చేసి ఈ విషయాలు రూఢీ చేసుకున్నారట. 

వెయ్యి మందిని ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, మహిళ-పురుషుడు జంటలుగా విభజించి ఈ పరిశోధన చేశారట. వీరితో ప్రింటర్లు, టూత్‌పేస్టులు, ఫ్లాష్‌లైట్స్‌, టైర్లు, హోటల్స్‌, హెడ్‌ఫోన్స్‌, లాటరీని ఏ ధరకు కొనాలి, షేర్లు కొనుగోలు తదితర పనులు అప్పగించారు. ఇద్దరూ పురుషులే ఉంటే వారు పరస్పరం ఆధిపత్యం చూపించారట. ఇద్దరూ మగువలే అయినప్పుడు వారు ఎలాంటి బేషజానికీ, ఆధిపత్యానికి పోకుండా సహకరించుకున్నారట. అందుకే సులభంగా పనవ్వాలంటే ఆడాళ్లను ప్రయోగించండి..



మరింత సమాచారం తెలుసుకోండి: