ఒకప్పుడు తమిళనాడు సీఎం జయలలితకు మంచి స్నేహితురాలిగా పేరు తెచ్చుకున్న శశికళ తర్వాత ఆమె కోపాని గురై పార్టీ నుంచి బహిష్కరించబడింది. గతంలో అన్నాడీఎంకే అధినేత్రం జయలలితపై కామెంట్ చేసినందుకు  ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివను చెంపదెబ్బ కొట్టినందుకు శశికళను సీఎం జయలలిత సస్పెండ్ చేసిన సంగతి తెల్సిందే. ఇప్పుడు తన సొంత పార్టీపైనే శశికళ నిప్పులు చెరుగుతున్నారు.  అన్నాడీఎంకే పార్టీని బానిసల గుంపు(స్లేవ్ గ్యాంగ్)గా వర్ణించారు. బానిసల గుంపులో భాగం కావాలనుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎంపీ శశికళ పుష్ప, ఆమె కుటుంబ సభ్యులు తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ వారి ఇంట్లో పనిచేసే 22 ఏళ్ల యువతి కేసు పెట్టింది. ఆమె భర్త టి లింగేశ్వర్ తిలకన్‌తో పాటు... ఆమె కుమారుడు ప్రదీప్ రాజాలు తనను, తన సోదరిని లైంగికంగా వేధించారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 అయితే తమపై అధికార పక్షం కావాలనే కక్ష్యపూరిత చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. తనను వేధిస్తే నాడార్ సామాజిక వర్గం ప్రతిఘటిస్తుందని ఆమె హెచ్చరించారు. 'నేను నాడార్ కులానికి చెందిన దాన్ని. భయపడేది లేదు. ప్రజలు ఇదంతా చూస్తున్నారు. నాకు అండగా నా కులం నిలుస్తుంది. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లోని బలమైన కమ్యునిటీల్లో నాడార్ కులం ఒకట'ని పుష్ప అన్నారు.

 ఇక జయలలిత ఆజ్ఞను ధిక్కరించిన శశికళ పుష్ప చుట్టు ఉచ్చు బిగుస్తుంది. గతంలో శశికళ పుష్ప ఇంట్లో పనిచేస్తున్న ఏడుగురు వేర్వేరు కారణాలతో మరణించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులు హోరెత్తుతుండడంతో ఆత్మరక్షణలో పడ్డ శశికళ పుష్ప, ఇక తమిళనాట న్యాయం జరగదని భావించి ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: