గ‌త 12వ తేదీన ప్రారంభ‌మైన కృష్ణా పుష్క‌రాల‌తో ఏపీలో భ‌క్త‌జ‌నం పుక‌ల‌రించిపోతుంది. మ‌రో వారం రోజుల పాటు కొన‌సాగే కృష్ణా పుష్క‌రాలు ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలిపినా... యాత్రికుల నుంచి తీవ్ర విమ‌ర్శలు ఎదురుకుంటుంది.  విజ‌య‌వాడ ప‌రిధిలో ఉన్న ఘాట్ల వ‌ద్ద అంతంత మాత్రంగానే ఉన్నాయ‌న్న‌ది నిర్వివాదాంశం. ఘాట్ల వ‌ద్ద భ‌క్తుల‌కు ప్రత్యేకించి మంచినీరు , ఆహార పదార్ధాలు పంపిణీ చేస్తామ‌ని చెప్పినా అది మాత్రం మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేదు. ఇక సాయంత్రం అయితే చాలు అక్క‌డ దొంగ‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. గ‌తంలో గోదావ‌రి పుష్క‌రాలు చంద్ర‌బాబు ఘోర వైఫ‌ల్యాన్ని చూసిందే. అయితే తాజాగా  ఇదే ప‌రిస్థితుల‌ను మ‌రోసారి కృష్ణా పుష్క‌రాలపై ఎదుర్కొనే అవ‌కాశాలు ఉన్నాయి.

కృష్ణా పుష్క‌రాల్లో పాముల హల్ చ‌ల్....

వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో భ‌క్తులు కృష్ణ‌మ్మ ప‌ర‌వళ్లలో మ‌న‌క‌లు వేసి త‌రిస్తున్నారు. అంధ్ర దేశ్ లో పుష్క‌రాలు జోరుగా సాగుతున్నాయి. పిల్లా పాపల‌తో క‌లిసి వ‌చ్చి పుణ్య స్నానాలు ఆచ‌రిస్తున్నారు. గ‌త నాలుగు రోజుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని వివిధ ఘాట్ల‌తో దాదాపు 54 ల‌క్ష‌ల మంది స్నానాలు ఆచ‌రించారు. ఒక్క విజ‌య‌వాడ‌లోనే సోమవారం ఏడు ల‌క్ష‌ల మందికి పైగా స్నానాలు ఆచ‌రించారు. నాలుగు రోజుల్లో విజ‌య‌వాడలో 24 ల‌క్ష‌ల మంది  కృష్ణా జ‌లాల‌తో స్నానాలు చేసి పునీతుల‌య్యారు. అయితే అక్క‌డి ప్ర‌భుత్వ ఏర్పాట్ల పై మాత్రం భ‌క్తులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. వివిధ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుద‌ల చేస్తున్న వేళ‌, ఒడ్డున ఉన్న పుట్టలు,  పొద‌ల పైకి నీరు  ప్ర‌వ‌హిస్తుండగా... పాములు కొట్టుకు వ‌స్తున్నాయి. విజ‌యవాడ‌లోకి దుర్గా ఘాట్ లో ఈ రోజు ఉద‌యం గుంటూరు జిల్లాకు చెందిన సుమంత్ అనే యువ‌కుడికి పాము కాటుకు గురయ్యాడు. అక్క‌డికి వచ్చిన పాముల‌ను  చూసిన పుష్క‌ర భ‌క్తులు  బెంబేలెత్తి, నదిలోకి దిగి స్నాం చేసేందుకు భ‌య‌ప‌డుతున్నారు.

సినీ ఫ‌క్కిలో దొంగ‌త‌నాలు....

ఇక దొంగ‌లు కూడా అదే స్థాయిలో ఎగ‌బ‌డుతున్నారు. మ‌న‌కున్న పాపాల‌ను పొగొట్టుకోవ‌వాల‌నుకుంటున్న భ‌క్తుల‌ను దొంగ‌లు నిలువునా దో చేస్తున్నారు. వారి దృష్టి మ‌ర‌ల్చి అందినకాడికి దోచుకుపోతున్నారు. తాజాగా విజ‌య‌వాడ ప‌విత్ర సంగమం ఘాట్ లో సినీ ఫ‌క్కిలో దొంగ‌తనం జ‌రిగింది. పితృ దేవ‌త‌ల‌కు పిండ ప్ర‌ధానం కోసం  వ‌చ్చిన ఓ కుటుంబ స‌భ్యులు స్నానానంత‌రం పిండ ప్ర‌దానం చేసే కార్య‌క్ర‌మంల‌లో ఉండ‌టం తో నెక్లెస్, గొలుసు, ఉంగ‌రాలు ఇత‌ర అభ‌ర‌ణాల‌ను తీసి ఓ బ్యాగులో పెట్టి ప‌ట్టుకోగా అక్క‌డే కాపుకాసిన దొంగ చేతిలో సంచి లాక్కుని ప‌రారయ్యాడు. భ‌క్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం మూట గ‌ట్టుకునే ప్ర‌భుత్వం, భ‌క్తుల ర‌క్ష‌ణ ఇవ్వ‌డం లేద‌ని వాపోతున్నారు. క‌నీసం సౌక‌ర్యాల‌ను క‌ల్పిపించ‌డంలో స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని వాస్త‌వం. 


మరింత సమాచారం తెలుసుకోండి: