ప్రస్తుతం దేశంలో రాజకీయం అంటే అర్థం మారిపోయింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో రాజకీయాలకు, నేటి కొత్త తరం రాజకీయాలలో చాలా మార్పులు సంభవించాయి. నాడు రాజకీయాలంటే.. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, సామాజిక శ్రేయస్సే ధ్యేయంగా రాజకీయాల్లోకి చేరి పని చేసే వారు. కాని నేడు ఆ అర్థం పూర్తిగా మారిపోయింది. ప్రజలను ముప్పుతిప్పలు పెట్టడానికి, ప్రజలను నిండా దోచుకోవడానికి వాడుకొంటున్నారు. 



ఆనాడు సామాజిక కార్యకర్తలు, రాజకీయ వేత్తలు రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తే, నేడు నేర ప్రవృత్తి కలవారు, సామాజిక సమస్యలపై అవగాహన లేని వారు రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. మరి ఈ మాటలు కాస్త అటుంచుతే నాటి యువత రాజకీయాలంటేనే బయపడుతుంది.. ఎందుకు...? నీటి రాజకీయాలు యువత చేరడానికి పనికిరావా...? యువతకు నేటి రాజకీయాలతో ఒరిగేది శూన్యమా...? రాజకీయాలపై యువత శైలి మారాల్సిన సమయం ఆసన్నమైందా..? 



నాటి రాజకీయాల్లోకి ఎక్కువడా యువకులే రంగ ప్రవేశం చేసే వారు. కాని రాను రాను రాజకీయాలంటే మారిన అర్థంతో యువతకు రాజకీయాలపై ఆసక్తి సన్నగిల్లింది. కారణం రాజకీయాలు అడ్డ దారులు తోక్కడమే. తల పండిన నాయకులు కొంత మంది అల్లరి మూకలను తన బలగం గా మార్చుకొని తనను తానే నాయకుడిగా ప్రకటించుకుంటున్న నాయకులు మన దేశంలో ప్రస్తుతం కోకొల్లలు. ఢిల్లీ నుండి గల్లీ నాయకుడి వరకు ప్రతి ఒక్కరు ఒక రౌడీ బలగాన్ని తన వెంట వేనుకేసుకొని తిరగడం అడ్డమైన పనులన్నీ వారితో చేయించుకోవడం, 



ఎవరైనా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినా వారిని వెంటాడి వేధించడం, వినకపోతే ప్రాణం తీయడానికైనా వెనకాడకపోవడం, ఇలాంటి చర్యలే యువతను ప్రస్తుతం దేశ భవిష్యత్తును నిర్ణయించే రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నాయి. రౌడీ నాయకులంతా ఒక్కటవ్వడం, ప్రజల మీద పడి రాక్షసుల్లా దోచుకోవడం, ప్రాణ భయంతో ప్రజలు వీరి ఏది చెప్పిన తలాడించడం నేటి రాజకీయాల్లో షరా మామూలే. ఇలాంటి కఠిన రాజకీయ వ్యవస్థనుండి మన దేశం బయటపడాలంటే ముందుగా ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి.



రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా ఒక్క ఓటరుకు మాత్రమే ఉంది. ఓటు వేసే ముందు మనం ఎన్నుకునే నాయకుడు నిజంగా ఆ పదవికి అర్హుడు అవుతాడా..? ప్రజా సమస్యలపై స్పందించే గుణం అతనికి ఉందా...? సామాజిక సమస్యలపై అతనికి ఉన్న అవగాహన ఎంత...? ఇలాంటి ప్రశ్నలను ఒక్కసారి బేరీజు వేసుకొని ఎన్నికలో బరిలోకి నిలబడ్డ వ్యక్తికి ఒటేసినట్లయితే మంచి నాయకుణ్ణి ఎన్నుకున్న సంతృప్తి మీకు, మంచి నాయకుడు ప్రజలకు లభించాడన్న సంతృప్తి దేశానికి మిగులుతుంది. ముఖ్యంగా యువకులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ప్రజలు వారి ఆలోచనా విధానం సరైన రీతిలో ఉంటే వారికే పదవులను కట్టబెడితే, కొంత స్వార్థ పర రాజకీయాలనుండి ప్రజలను దూరం చేసిన వారవుతాం కూడా. రాజకీయ పార్టీలు సైతం యువకుల రంగ ప్రవేశానికి అమిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: