విదేశాల్లో మోడ్రన్ డ్రెస్లు వేసుకోవడం సర్వ సాధారణం. అక్కడ అది చాలా కామన్ కానీ, మన దేశంలో అలాంటివి చాల తక్కువనే చెప్పాలి. అలా అని కొన్ని దేశాల మాదిరి దుస్తుల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. భారతదేశం అంటేనే సాంప్రదాయాలకు పెట్టింది పేరు. భారతీయ సాంస్కృతి, సాంప్రదాయాలను విదేశీయులు కూడా ఎంతగానో గౌరవిస్తారు. తర తరాలుగా సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ కొన్ని నగరాల్లో తప్పా భారతీయ కట్టు బొట్టుతోనే కనిపిస్తారు మహిళలు, అటు పురుషులు కూడా వీలైతే పంచ, లేదంటే ప్యాంటు, చొక్కాలోనే అగుపిస్తుంటారు. అయితే విదేశీ ప్రభావమో.. జీవన శైలిలో వస్తున్న మార్పులో.. ఆధునిక సాంప్రదాయమో తెలియదు కానీ మెట్రో నగరాల్లో ఈ మధ్య మన దగ్గర కూడా మగవాళ్లు నెక్కర్లలో, అమ్మాయిలు షార్టులు, ప్యాంటులు, స్కర్టుల్లో తిరిగేస్తున్నారు. దీంతో భారతీయ సాంప్రదాయ విలువలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.

Image result for indian girls skirts

ఈ మధ్య కాలంలో ఈ తరహా దుస్తులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదని సాంప్రదాయవాదులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. యువత విదేశీ మోజులో భారతీయ విలువలకు మంగళం పాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో కూడా దుస్తుల విషయంలో కొన్ని నిబంధనలు అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని కాలేజీలు కూడా జీన్స్ వేసుకోవడాన్ని నిషేధిస్తున్నాయి.

Image result for indian girls skirts

తాజాగా కేంద్ర మంత్రి కూడా విదేశీయులు దుస్తుల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాకు వచ్చే విదేశీ పర్యాటకులు దయచేసి స్కర్టులు ధరించకండి అని కేంద్ర మంత్రి మహేష్ శర్మ సలహా ఇచ్చారు. దేశంలో పర్యటించేందుకు వచ్చిన విదేశీ పర్యాటకులు ఎం చేయాలి ? ఎం చేయకూడదనే అంశాలను ఓ కార్డుపై రాసి విమానాశ్రయాల్లో వారికి అందజేస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు. సాంస్కృతిక దేశమైన మన భారత్ లో దేవాలయాలను సందర్శించేందుకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఉందని ఆయన అన్నారు. ఆగ్రాలోని అద్భుతమైన తాజ్ మహల్ తో పాటు ఇతర ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను చూడటానికి వచ్చిన విదేశీ పర్యాటకుల భద్రత కోసం స్కర్టులు ధరించి తిరగవద్దని కేంద్రమంత్రి సూచించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు.

Image result for indian girls skirts

విదేశీ పర్యాటకులు ఏం ధరించాలి ఏం ధరించకూడదు అని తాము చెప్పడం లేదని రాత్రివేళ బయటకు వెళ్లేటపుడు వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ఎవరైనా దుస్తులు వారి ఆలోచనా విధానాన్ని బట్టి ధరించవచ్చని, దానిని మార్చుకోవాలనే హక్కు తనకు లేదన్నారు. కానీ భారతీయ విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. స్కర్టులు ధరించవద్దని కేంద్రమంత్రి ఇచ్చిన సలహాపై ట్విట్టర్ ద్వారా నెటిజన్లు స్పందించారు. ఇలాంటి సలహాలతో దేశాన్ని కించపర్చవద్దని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వమంత్రి కపిల్ మిశ్రా వ్యాఖ్యానించారు. కొందరు నెటిజన్లు కేంద్రమంత్రికి మద్ధతుగా నిలిచారు. దేవాలయాలు, ఇతర పవిత్ర స్థలాల్లో విదేశీయులు స్కర్టులు ధరించరాదని కేంద్రమంత్రి చేసిన సూచనతో తాము ఏకీభవిస్తున్నట్లు పలువురు ట్విట్ చేశారు. మన దేశ మహిళలు ఇస్లామిక్ దేశాలకు వెళ్లినపుడు బుర్ఖా, స్కార్ఫ్ ధరించాలని కూడా సలహా ఇవ్వాలని ఓ నెటిజన్ ట్విట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: