కొన్ని వ్యవహారాలు మన శత్రువు ని ఎంత ఇరకాటం లో పెడతాయి అని తెలిసినా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరం గా కెలకడం అంత బుద్ధి పొరపాటు ఇంకొకటి ఉండదు. ఈ విషయం జగన్ మోహన్ రెడ్డికి ఎప్పుడో బోధ పడింది. " తెలుగు దేశం ప్రభుత్వాన్ని గంట వ్యవధి లో కూల్చేయ్యగలను నేను తలచుకుంటే " అని స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని గంటల్లో తన ఎమ్మెల్యే లని కోల్పోవడం మొదలు పెట్టాడు జగన్ మోహన్ రెడ్డి. వరసగా నెల నెలన్నర సమయం లో దాదాపు ఇరవై ఎమ్మెల్యే లని కోల్పోయాడు జగన్ బాబు. అత్యుత్సాహం ప్రదర్శించడం  - ఎమ్మెల్యే లని కోల్పోవడం జగన్ కి బుద్దోచ్చిన విషయం. అనవసరంగా టీడీపీ ని రెచ్చగొట్టాను, బాబుగారికి వార్నింగ్ ఇచ్చాను అని ఆయన అనుకునే ఉంటాడు కూడా.

అయితే ఇప్పుడు ఇంత జరిగినా కూడా జగన్ మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నాడు. ఓటుకు నోటు కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రెచ్చిపోతున్నారు ఆయన. తమకి ఏమాత్రం కూడా సంబంధం లేని ఓటుకు నోటు కేసులో టీడీపీ ని మళ్ళీ కెలుకుతున్నారు. ఈ కేసు విచారణ మీద హై కోర్టు ఎనిమిది వారలా స్టే విధించిది దీన్ని సవాల్ చేస్తూ మంగళగిరి వైకపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రేం కోర్టు లో సవాల్ చేసారు .ఇవాళ ఆ కేసుని స్వీకరించిన కోర్టు రాజకీయ ఉద్దేశ్యాల తో కేసులు వెయ్యడం తప్పు అంటూ చివాట్లు పెట్టి మరీ పిటీషన్ ని కొట్టేసారు. ఓటుకు నోటు కేసులో తాము కలగజేసుకోబోము అంటూ సుప్రీం తేల్చి చెప్పేసింది. అయితే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ పై నెలరోజుల్లో నిర్ణయం తీసుకోమని హైకోర్టుకి సూచించింది.హై కోర్టు నుంచి తుది తీర్పు వచ్చిన తరవాత కావాలంటే సుప్రీం కి రమ్మని కోర్టు కోరింది.

వైకపా కి ఓటుకు నోటు కేసు తో మినిమం సంబంధం కూడా లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు ని అప్రతిష్ట పాలు చెయ్యడం అంటే ప్రతిపక్షంలో ఉన్న వైకాపా కి సాధారణంగా నే మహా సరదాగా ఉంటుంది. కానీ వైకాపా కి ఇప్పటికే షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న చంద్రబాబు నీ , టీడీపీ సర్కారు నీ కెలకడం అంటే కొరివి తో తల గోక్కోవడం అని వైకపా ఇక ఎప్పటికి అర్ధం చేసుకుంటుందో ? సరిగ్గా ఈ పరిణామాలు జరుగుతున్న తరుణం లోనే రాంకి కేసులో జగన్ , విజయసాయి రెడ్డి లని ఈదీ కోర్టు నుంచి విచారణ కి రమ్మని ఆదేశాలు రావడం యాదృచికం కానే కాదు అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు చేసే కుట్రలు తాము చాలా లైట్ గా తీసుకుంటాం అని భూమాన అంటూ ఉంటారు కానీ మరి వైకపా చేస్తోంది ఏంటి ? కుట్ర కాదా ? ఏమాత్రం సంబంధం లేని ఓటుకు నోటు కేసుని అడ్డం పెట్టుకుని చంద్రబాబు మీద గెలవాలి అని అనుకోవడాన్ని ఏమనాలి ? తేదీపీ ని రెచ్చగొడితే తామే నష్టపోతాం అని రీసెంట్ గానే అనుభవం అయినా కూడా ఇంకా వారిని కెలికే ధోరణి మార్చుకోని వైకపా కి చంద్రబాబు భారీ షాక్ ని సిద్దం చేస్తున్నారు అని విశ్వాస నీయ వర్గాల సమాచారం.

కేవలం ఎనిమిది వారాల గడువు,స్టే తరవాత మళ్ళీ చంద్రబాబు ని ఓటుకు నోటు కేసులో విచారిస్తారు అని వైకపా నే చెప్తోంది . మరి ఆ కొన్ని నాళ్ళూ ఎందుకు ఆగలేకపోయింది అనేది ఆశ్చర్యకరం. ఎనిమిది వారాల తరవాత ఏసీబీ విచారించకుండా ఉంటుందా ? వారికి తెలియని చట్టమా ? రాజకీయ విద్వేషం కారణంగా పరిస్థితి ని తన నేత్తిమీడకి తెచ్చుకుని తానే ఎక్కువగా కోల్పోయే పార్టీగా వైకపా మారుతోంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కళ్ళ ముందర కళ్ళు తెరిచి మూసే లోగా ఇరవై పైగా ఎమ్మెల్యేలని కోల్పోయి ఇంకా ఆ ఇబ్బందినుంచి తేరుకొని వైకపా శ్రేణులు ఎందుకు లేనిపోని కూని రాగాలు ? పోనీ గట్టి ఆధారాలు ఉన్న వేరే కేసు ఏదైనా అయితే రాజకీయ ప్రత్యర్ధి గా చంద్రబాబు అంతు చూద్దాం అని జగన్ ప్లాన్ చేసినా బాగుంటుంది కానీ సరైన ఆధారాలు లేని, కాల్ రికార్డింగ్ ల మీద నడుస్తున్న ఓటుకు నోటులు చంద్రబాబు తప్పించుకునే (ఒకవేళ తప్పుంటే ) ఛాన్స్ లు బోలెడు ఉన్నాయి.

ఇలాంటి అనాకానీ కేసులో హడావిడి చేసినా లాభం ఏముంది? జనాల దృష్టి లో ఫెవికాల్ గాళ్ళు రా బాబు అని అనిపించుకోవడం తప్ప ? చంద్రబాబు మీద కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా విమర్శలు చేస్తూ ఉంటాయి ఇబ్బంది పెట్టె పరిస్థితి ఒస్తే ఓడిసిపోవు కానీ మరీ ఇలా ద్వేశించడమే సిద్దాంతంగా పెట్టుకున్న పార్టీ వైకపా .. ఇప్పటికే చావు దెబ్బ తిన్న వైకాపా ఇలాంటి పనులు చేసి ఇంకెంతమంది ఎమ్మెల్యే లని పోగొట్టుకుంటుంది ?


మరింత సమాచారం తెలుసుకోండి: