'భారత ప్రధాని నరేంద్ర మోడీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బాధ్యతారాహిత్యంతో మాట్లాడారు. మా దేశాన్ని తీవ్రవాద దేశంగా అభివర్ణిస్తారా? ప్రపంచానికి తీవ్రవాదాన్ని ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్న పాకిస్తాన్‌ అని ఆరోపిస్తారా? ఎంత ధైర్యం? మేం అభివృద్ధి కాముకులం. మేం కూడా తీవ్రవాద బాధితులమే.' అంటూ పాకిస్థాన్ ఆగ్రహం వెలిబుచ్చింది. 

 

కేరళలో నరేంద్రమోడీ పర్యటిస్తుండడం, ఈ సందర్భంగా ఓ బహిరంగ సభలో పాకిస్థాన్ పై దుమ్మెత్తిపోయడం తెల్సిన విషయాలే. 'పాకిస్థాన్ ప్రజలతో మాట్లాడుతున్నా, పాకిస్థాన్ లోని నా అన్నదమ్ములతో, అక్కాచెల్లెళ్ళతో మాట్లాడుతున్నా, మీ పాలకుల తల్లిదండ్రులు, ఒకప్పుడు భారత దేశం లోనే పుట్టారు. వారంతా ఈ నేలతల్లిని ముద్దాడారు.

 

మీ పాలకుల్ని అడగండి, పేదరికంతో యుద్ధం చేద్ధామని అలాంటి యుద్ధానికి మేం కూడా సై' అంటూ నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ లో భూప్రకంపనలే కాదు జన హృదయంలో రణగణ ద్వని సృష్టిస్తున్నాయి.

 Image result for modi image

స్వాతంత్య్రం కోరుకుంటున్న పాకిస్థాన్ లోని బలూచిస్తాన్‌లోనే కాదు, ఇస్లామాబాద్‌, కరాచీ, అజాద్ కస్మీర్ తదితర ప్రాంతాల్లో పాకిస్థాన్ అక్కడి ప్రజలు సూటిగా నరేంద్రమోడీ వ్యాఖ్యలపైనే ప్రశ్నించడం మొదలు పెట్టారు. దాంతో, పాకిస్తాన్‌ పాలకుల వెన్నులో వణుకు మొదలైంది.

బలూచీ ప్రజలు  

 Image result for people of balochistan

దాన్ని పురస్కరించుకొని 'శ్రీనగర్‌లో రక్తం ఏరులై పారుతుంది జాగ్రత్త' అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు పాకిస్థాన్ కి చెందిన పాలకులు, పెద్దలు. వీరిలో మంత్రులు కూడా వున్నారు.

 Image result for people of balochistan

మొత్తమ్మీద, నరేంద్రమోడీ మాటల తూటాలు బాగానే పనిచేశాయి. ప్రపంచ దేశాలు సైతం, భారత్‌ వ్యవహరిస్తున్న సంయమనం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో, పాకిస్థాన్ చేస్తోన్న 'మారణహోమం, రక్తం ఏరులై పారుతుంది.' లాంటి ప్రకటనల్నీ ప్రపంచ దేశాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇప్పటికే 150 కి పైగా దేశాలు భారత్‌కి అండగా, పాకిస్థాన్ కి వ్యతిరేకం గా నిలిచాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీరీలు Image result for people of azad kashmir

యుద్ధం అంటే పాకిస్థాన్ పైకి తుపాకీ లతో, యుద్ధ విమానాలతో, యుద్ధ ట్యాంకులతో, మిస్సైళ్ళతో దండెత్తడం కాదు, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక, ప్రకృతివనరుల తో వ్యూహాత్మకంగా - వ్యూహాలతో కూడా దండెచ్చవచ్చుననే విషయం ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. సహనం ఎప్పుడూ చేతకానితనం కాబోదు. సహనం ఒక్క ధైర్యవంతుడికే సాధ్యం. పిరికి వాడిలో సహనం ఊహించలేము. ఆ సుగుణం పాక్ పాలకులకు అసాధ్యం.

Image result for people of azad kashmir

మరింత సమాచారం తెలుసుకోండి: