డీమానిటైజేషన్ ప్రకటించి 30 రోజులు గడిచాయి. నవంబర్ 8-9 తేదీల అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చిన పెద్ద నోట్ల రద్దు నల్లధనంపై యుద్ధానికి ఉద్దేశించినదే అయితే, అది ఎంతమేరకు సఫలమైందీ సందేహమే. నల్లడబ్బు ఉన్న వారు ఏమి కష్టపడుతున్నారో తెలి యదు కానీ, సామాన్యుల బాధలు మాత్రం చెప్పనలవి కాకుండా ఉన్నాయి దేశమం తటా బ్యాంకుల వద్ద అవే క్యూలైన్లు. కుటుంబ అవసరాల కోసం వచ్చే ఉద్యోగులు, మహిళలు, ఉద్యోగ పెన్షన్, సం క్షేమ పెన్షన్ కోసం వచ్చే వయోవృద్ధుల బాధలు వర్ణనాతీతం.