నేడు ప్రపంచవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. శివాలయాలన్నీ భక్త జనంతో కిటకిటలాడుతున్నాయి. కాగా, మన భారత దేశంలో ఎన్నో శైవక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో కర్ణాటకలోని మురుడేశ్వర్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ భారతదేశంలోనే అతి పెద్ద శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సముద్ర తీరంలో కొలువుతీరిన 122 అడుగుల శివుడి విగ్రహాం దేశంలోనే అతి పెద్ద శివుడి విగ్రహాంగా పేరు తెచ్చుకుంది.  అలాగే, ఈ మురుడేశ్వర్ క్షేత్రానికి మరో ప్రత్యేకత ఉంది. కైలాసం నుంచి రావణుడు తీసుకుని వస్తున్న ఆత్మలింగం వినాయకుడి కారణంగా నేలపాలు అవుతుంది. ఆ ఆత్మలింగాన్ని రావణుడు బలంగా పెకిలిస్తున్న సమయంలో లింగంలోని ఒక భాగం ఈ మురుడేశ్వర్ లో పడిందని పురాణాలు చెపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: