ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో మరో అవినీతి మంత్రి చేరిపోయారు. ఇప్పటికే పలువురు మంత్రులు అవినీతి ఆరోపనలకు సంబంధించి కేసులను ఎదుర్కొంటుండగా తాజాగా మరో మంత్రి అవినీతిబురద పూసుకున్నాడు. మంత్రి అవినీతి గూర్చి వెల్లడించిన కోబ్రాపోస్టును  అభినందించాల్సిందే......

మంత్రి శైలజానాధ్ గురించి ప్రజలకు పరిచయం లేని వారు లేరు. ఆయన పేరు అందరికీ సుపరిచితమే. తెలంగాణకు వ్యతిరేకంగా గళమెత్తి ఊరూవాడా తిరుగుతున్న వ్యక్తిగా సుపరిచితుడు. నేరుగా అవినీతికి పాల్పడకపోయినా ఆయన అవినీతికి అతీతుడను కాదని నిరూపించుకున్నారు. మరో సీనియర్ మంత్రి కూడా ఇందులో ఉన్నట్లు కోబ్రా పోస్ట్ తెలిపింది. అవినీతి ఎలా జరుగుతుందో తెలియజేయడం ద్వారా నేతల స్వరూపాన్ని బయటపెట్టారు.

బ్యాంక్ ల అక్రమ లావాదేవీలపై రహస్య ఆపరేషన్ చేస్తున్న కోబ్రాపోస్ట్ కు ప్రాథమిక విద్యా మంత్రి సాకె శైలజానాథ్ దొరికి పోవడం సంచలనం కలిగించింది. ఇంతకాలం ఆయన సమైక్య ఉద్యమంతో సీఎంకు దగ్గరయ్యారు. తెలంగాణను వ్యతిరేకించే వారిలో ముందున్నారు. దీంతో ఆయన తన ప్రాధాన్యాన్ని పెంచుకున్నారు. తిరుపతిలోని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లో వారు పెట్టే నల్ల ధనానికి తాను హామీగా ఉంటానని పెద్దమనిషి హోదాలో భరోసా ఇచ్చారు. ఆయన కన్నా చాలా సీనియర్ అయిన మరో మంత్రి కూడా ఇలాంటి హామీయే ఇచ్చినా ఆడియో, విడియో రికార్డు చేయడం సాంకేతికంగా కుదరక పోవడంతో వివరాలు వెల్లడించలేదు.

బ్యాంకర్లు, రాజకీయ నాయకులు, హవాలా వ్యాపారులు కలిసి ఆంధ్రప్రదేశ్ లో నల్లధనం పంట పండిస్తున్న తీరును కోబ్రాపోస్ట్ బట్టబయలు చేయడం ఒక ఎత్తైతే, మంత్రుల అవినీతి కూడా వెల్లడి కావడం మరో కోణంగా చూడవచ్చు. తిరుపతికి చెందిన వైద్యుడు పసుపులేటి హరిప్రసాద్ కేంద్ర బిందువుగా ఢిల్లీ-హైదరాబాద్-తిరుపతిల మధ్య నడిచిన వ్యవహారం పెనుసంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: