నేటి రాజకీయాల మాటల యుద్దానికి చిరంజీవి సరితుగ లేకపోతున్నాడా?పొలిటికల్ సెలిబ్రిటీ చిరంజీవిఒక నాటి  మాజీ మెగాస్టార్‌ ప్రస్తుతం చిరు సినిమా హీరోకాదు ఓ రాజకీయనాయకుడు. అంతే కాకుండా కేంద్రం లో ఒక ముఖ్య శాఖకు మంత్రి. సినిమా హీరోగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చిరంజీవి రాజకీయనాయకునిగా మాత్రంతన పూర్తి సత్తా చూపెట్ట లేక పోతున్నాడు. ఒకప్పుడు చిరంజీవి మైక్‌ పట్టుకుంటే జనాలు ఈలలు వేసి  గోల గోల చేసేవారు.. అభిమానులు సీట్లో కుదురగా కూర్చోలేకపోయేవారు.. ప్రజలు సునామీలా పొటేత్తేవారు.. కాని ఇప్పుడు అంత సీన్‌ లేదు..పవర్ ఫుల్ పంచ్‌ డైలాగ్స్‌తో అభిమానులకు ఉత్సాహాన్నిచే చిరు ప్రసంగాల్లో ఇప్పుడు ఆ వేడి  కనిపించడం లేదు..

చిరు ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఎప్పుడు విదేశి పర్యటనల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.. టూరిజం సదస్సులతో పాటు, కేన్స్‌ లాంటి కలర్‌ఫుల్‌ వేదికల మీద కూడా ముఖ్య అతిధి లా కనిపిస్తున్నాడు. కాని ఏ వేదిక మీదా చిరులో మునుపటి మెగాస్టార్‌ చరిష్మా కనిపించటం లేదు.. మాటల్లో అప్పటి పవర్‌, పంచ్‌ మచ్చుకైనా కనిపించటం లేదు..తాజాగా తానా సభల్లో గత వారం  ప్రసంగించిన చిరంజీవి  తన మాటల్లో వాడి తగ్గిందని మరోసారి నిరూపించాడు.. తొలిసారిగా కేంద్రమంత్రి హోదాలో తానాకు హాజరైన చిరంజీవికి అదేస్థాయిలో ఘనంగా స్వాగతం పలికారు తానా నిర్వాహకలు.. తెలుగు మాటలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న ప్రవాస భారతీయులు చిరు ఏం మాట్లాడతాడో అని ఆశగా  ఎదురు చూస్తుంటే వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లాడు మెగాస్టార్‌..

advertisements - Call 040 4260 1008


 హీరోగా ఏది మాట్లాడిన చెల్లుతుంది కాని.. ఓ మంత్రిగా రాజకీయనాయకుడిగా తనకంటూ కొన్ని పరిథులుంటాయని భావించి ఉంటాడు  చిరు.. అందుకే తన మాటల్లో ఎక్కడ మునుపాటి వాడి వేడి కనిపించకుండ జాగ్రత్త పడుతున్నారు.. అయితే ఈ మాటలు చిరు రాజకీయ భవిష్యత్తుకు ఎంత వరకు ఉపయోగపడతాయోగాని ఆయన అభిమానులకు ఆయన రాకతో సభ మరింత సక్సెస్‌ అవుతుందనుకున్న నిర్వహకులకు మాత్రం నిరుత్సాహమే మిగిలింది.. చిరు మాటల్లో వాడి తగ్గడం కాంగ్రెస్‌ వర్గాల్లో కూడా కలవరం కలిగిస్తుంది.. ప్రస్థుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో జనాలను ఆకర్షించే ఎకైక నేతగా ఉన్న చిరు ప్రసంగాల్లో కూడా పస తగ్గిపోతే ఎలా అని తలలు పట్టుకుంటున్నారట. మొన్న కర్నాటకాలో జరిగిన ఎన్నికలలో కూడా చిరంజీవి ప్రసంగించిన ప్రదేశాలలో జనం విపరీతంగా వచ్చారు కానీ ఆ జనాన్ని ఓట్లు గా మార్చ లేకపోయాడని చితంజీవి పై అపవాదు ఉంది. ఈ పరిస్థితులలో రాబోతున్న ఎన్నికల సమరంలో అటు జగన్ ఇటు చంద్రబాబు ల వాడి పొలిటికల్ ఉపన్యాసాలకు చిరంజీవి స్టామినా సరిపోతుందా అనే మాటలు వినిపిస్తున్నాయి.....

 

 

 



       

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: