ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటన. స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో జరిగిన ఈ అరాచకం వివరాల్లోకి వెళ్తే... తాము చేస్తున్న వికృత క్రీడను వారు ఏకంగా ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీం పెట్టారు. వారి పాపం పండి ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.. దీంతో ఆ దుష్టులు కటకటాల పాలయ్యారు. పోలీసులు వచ్చి ఆ నీచులను పట్టుకునే వరకు మూడు గంటల పాటు దారుణకాండ కొనసాగింది. బాధితురాలు స్పృహ కోల్పోయి జీవచ్ఛవంలా పడి ఉన్న దృశ్యాన్నీ కొందరు చూశారు. సుమారు అరవై వేల మంది ఉన్న ఫేస్‌బుక్ క్లోజ్డ్ గ్రూప్‌లో ఈ అకృత్యాన్ని ఆ ముగ్గరు లైవ్ స్ట్రీమ్ పెట్టగా.. 200 మంది చూశారు. 



స్టాక్‌హోంకు ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలోని ఉప్ప్సల అనే ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 18, 20, 24 ఏళ్ల యువకులు ముగ్గురు 30ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరు ఈ దారుణాన్ని ఫేస్‌బుక్‌లోని ఒక క్లోజ్డ్‌ గ్రూప్‌లో లైవ్‌స్ట్రీమ్‌ పెట్టారు. జోస్ఫైన్ లండ్‌గ్రెన్ అనే యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ‘ఆ దుర్మార్గుల్లో ఒకడు బాధితురాలిని వివస్త్రను చేసి పశువులా మీద పడ్డాడు. మరో నీచుడు గన్‌తో బెదిరిస్తూ కెమెరా ముందు పోజిచ్చాడు’ అని ఆమె చెప్పింది.



దీనిని చూసిన జోసెఫీన్‌ అనే యువతి పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యువతి విలేకర్లతో మాట్లాడుతూ 24ఏళ్ల నిందితుడు గతంలో కూడా ఇటువంటి పనులు చేశాడని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.  ఫేస్‌బుక్ నుంచి ఈ వీడియో తొలగించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ముగ్గరు నిందితులనూ అరెస్ట్ చేసి విచారణ సాగిస్తున్నారు. ఈ దారుణానికి సంబంధించిన చిత్రాలు ఉంటే అప్పగించాలని కోరగా.. స్వీడన్ నెటిజన్ల నుంచి ఈ అమానుష ఘటనపైన, ప్రభుత్వంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: