అమరావతిని అన్ని విషయాల్లో దేశంలోనే నెంబర్ వన్ చేస్తానంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. అందుకే అమరావతిలో నవ నగరాలు నిర్మిస్తానని ఆయన ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆయన చెప్పిన స్థాయిలో కాకపోయినా.. ఏపీ రాజధానిగా మారాక విజయవాడలో వైద్య సదుపాయాలు పెరిగిన మాట వాస్తవమే. ఇది కనిపిస్తూనే ఉంది. 

Image result for nagarjuna cancer centre vijayawada
ఈ సౌకర్యాలు ప్రైవేటు రంగంలోనూ చాలా వస్తున్నాయి. తాజాగా విజయవాడలోని కానూరులో ఏర్పాటు చేసిన నాగార్జున కేన్సర్ సెంటర్ ఏర్పాటైంది. నాగార్జున కేన్సర్ ఆసుపత్రిలో ఇప్పటికే ఉన్న సౌకర్యాలకు తోడు సరికొత్త ట్రూబీమ్ టెక్నాలజీతో నూతన భవనంలో కేన్సర్ సెంటర్ ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది. 


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ను దేశానికి వైద్య రాజధానిగా మార్చేందుకు అన్ని అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగా అమరావతిలో అనేక ప్రముఖ ఆసుపత్రులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
 
Image result for cancer
రానున్న రోజుల్లో అమరావతిలో అన్ని ప్రముఖ హాస్పిటల్స్ వస్తున్నట్లు తెలిపారు. విదేశాల నుండి ఆసుపత్రులు ఏర్పాటు చేసేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారన్నారు. అమరావతిని మెడికల్ హబ్ గా తయారు చెయ్యాలని తన లక్ష్యంగా చెప్పారు. విదేశాల నుండి అమరావతికి వైద్యానికి వచ్చే రోజులు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. త్వరలోనే ఎయిమ్స్ ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: