సినీ నటులంటేనే చాలా మందికి కోట్లు రూపాయలు కళ్లలో మెదులుతుంటాయి. విలాసవంతమైన జీవితం. కోట్లలో ఆదాయం.. ఇదీ వరుస. చాలామంది సినీ నటులు సినిమాల ఆదాయం చాలదన్నట్టు వాణిజ్యప్రకటనల్లోనూ నటిస్తుంటారు. సినీ హీరో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడంటే ఆ ఉత్పత్తి సేల్స్ విపరీతంగా పెరుగుతాయి.

mahesh babu add కోసం చిత్ర ఫలితం
అందుకే ఆయా కంపెనీలు కూడా సెకన్లలో ఉండే యాడ్స్ కోసం కోట్లు ముట్టజెప్పుకుంటాయి. ఇందుకు మనం అనేక మందిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పేర్లెందుకు కానీ చాలామంది తెలుగు స్టార్స్ కూడా యాడ్స్ ద్వారా విపరీతంగా సంపాదిస్తున్నారు. అది తప్పు కూడా కాదు. కానీ యూత్ తో ఎంతో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం యాడ్స్ లో ఎక్కడా కనిపించడు. 

junior ntr add కోసం చిత్ర ఫలితం
అలాంటి పవన్.. కొన్నిరోజుల క్రితం చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ఒప్పుకున్నాడు. తాజాగా మంగళగిరి సభలోనూ చేనేత గొప్పదనాన్ని చాటాడు. చేనేతలు కష్టాలు తెలుసుకాబట్టే.. బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నానని .. ప్రతి తెలుగువ్యక్తీ.. చేనేతను ధరించాలనీ పిలుపునిచ్చారు. అన్నం పెట్టే రైతన్న బట్టలు నేసే నేతన్న దేశానికి అత్యంత ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు.



 రైతులు, నేతన్నలు కన్నీళ్లు పెట్టడం దేశానికి సుభిక్షం కాదని అన్నారు. చేనేతకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ముందుకు వచ్చినప్పుడు కొందరు హేళనగా మాట్లాడారని వడ్డించే వాడిని వదిలి ఎంగిలి విస్తరాకుల వెంట పడుతున్నానంటూ మాట్లాడారన్నారు. దీనిని తాను అవమానంగా భావించడం లేదని శుభ్రం చేసే పవిత్ర కార్యంగా భావిస్తున్నానని చెప్పారు. తెలుగువారందరూ.. వారానికి ఒకరోజైనా చేనేతను ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికులు అనొద్దని.. కళాకారులు అని సంబోధించాలని సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: