ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సమస్యలున్నాయని, కొత్త అసెంబ్లీలోనైనా సభను సజావుగా నడిపించి తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మూడేళ్ల చంద్ర‌బాబు పాలనలో విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాము ప్రస్తావించిన ఏ అంశం పైనా సభలో అధికార పక్షం స‌రైన స‌మాధానం చెప్ప‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలోని వెలగపూడిలో మార్చి 6వ తేదీ నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13న రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.


'కొత్త అసెంబ్లీలోనైనా మాట్లాడే అవకాశం ఇవ్వండి'

కేవలం మేం చెప్పిందే మీరు వినండి అనేలా అధికారపక్షం ప్రవర్తిస్తుందని విమర్శించారు. కొత్త అసెంబ్లీలోనైనా సాంప్రదాయాన్ని పాటించాలని, సభను సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పక్షం చేసే తప్పులను ఎత్తిచూపడమే విపక్షంగా తమ బాధ్యత అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలోని వెలగపూడిలో మార్చి 6వ తేదీ నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13న రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.


Image result for srikanth reddy

పల్లెలకు పల్లెలు వలసలు వెళ్లిపోతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ అధికారులపై టీడీపీ నిందలు మోపుతోందని విమర్శించారు. కొంతమంది అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, తాగునీటి, నిరుద్యోగ, మహిళా స‌మ‌స్య‌ల‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు లాంటివి జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. వాటితో పాటు పార్టీ ఫిరాయింపుల అంశం, స్విస్ ఛాలెంజ్ విధానం, రాజధాని కోసం చేపట్టిన భూ సేకరణ అంశాల‌పై తాము ప్ర‌శ్నించాల్సి ఉంద‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: