జేసీ దివాక‌ర్ ట్రావెల్స్ వ్య‌వ‌హారం చంద్ర‌బాబుకు కొర‌క‌రాని కొయ్య‌గా మారింది. అటు చూస్తే ప్ర‌జ‌లు, ప్ర‌తి ప‌క్షం... ఇటు చూస్తే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే. మొత్తంమీద ఏమీ చేయాలో దిక్కు తొచ్చ‌ని ప‌రిస్థితిని ఇప్పుడు చంద్ర‌బాబు ఎదుర్కుంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన దివాకర్‌ ట్రావెల్స్‌ ఘోర బస్సు ప్రమాద ఘటనలో దోషులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. ప్రమాదం నుంచి పార్టీ శ్రేణుల‌ను బయట పడేయడానికి శతధా ప్రయత్నిస్తోంది. బస్సు ప్రమాద ఘటనపై చంద్రబాబు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో వాటి నుంచి బయట పడటానికి పాట్లు పడుతున్నారు. 

ప్రమాదానికి గురైన బస్సు తన పార్టీ ఎంపీది కావడం.. ఆ బస్సుకు రెండవ డ్రైవర్‌ లేకపోవడం.. పోస్టుమార్టం చేయకుండానే డ్రైవర్‌ మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రతిపక్ష నేత నిలదీయడంతో మొత్తం ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. అందులో భాగంగానే సాక్షాత్తు క్యాబినెట్‌నే వేదికగా చేసుకుని ప్రతిపక్ష నేతపై ఎదురు దాడికి దిగారు. మరోవైపు ఒక్క హామీ నెరవేర్చక పోవడంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం లేదు. కర్నూల్లో గంగుల కుటుంబం జగన్‌ వెంట నడవడంతో టీడీపీలో ప్రకం పనలు మొదలయ్యాయి. 

ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫిరాయింపుదారుల ను తిరిగి ఎన్నిక ల్లో నిల్చోబెట్టి గెలిపించుకోలేని దయనీయ పరిస్థితి. అనంతపురంలో జేసీ బ్రదర్స్‌ను పార్టీలో చేర్చుకున్నప్పు డు మంత్రి పదవులు ఆశ చూపారు. తీరా మూడేళ్లయినా ఆ ఊసే లేదు. ఇప్పుడు కూడా వారిని వెనకేసుకురాక పోతే అక్కడా అదే పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి క్యాబినెట్‌ను వేదికగా చేసుకుని ప్రతిపక్ష నేతపై గోబెల్స్‌ ప్రచారానికి తెర లేపారు. బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించి.. పలు సందేహాలు లేవనెత్తడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారు. 

ఈ విషయాలన్నింటినీ జగన్‌ తప్పకుండా త్వరలో పారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తారని, గట్టిగా నిలదీసి ప్రశ్నల వర్షం కురిపిస్తే తన పరువు గంగలో కలుస్తుందని ఏకంగా పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత పైనే కేసు పెట్టారు. క్యాబినెట్‌ మీటింగ్‌లో ఆసాంతం ఇదే విషయమై చర్చలు జరిపారు. జగన్‌ ఘటనా స్థలిలో పర్యటించినప్పటి వీడియోను క్యాబెనెట్‌ మీటింగ్‌లో పలుమార్లు వీక్షించి పోస్టుమార్టం చేయకుండా మృతదేహాలను ఎలా తరలిస్తారని ప్రతిపక్ష నేత నిలదీసి అడగడమే పాపమన్నట్లు తీర్మానించేశారు.

మ‌రోవైపు.. సీఎం చంద్రబాబు జేసీ సోదరుల్లో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడంతో అప్పుడ ప్పుడు ఎంపీ జేసీ పరోక్షంగా ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఈ తరుణం లో వారిపై బస్సు ప్రమాద కేసు పెడితే అసలుకే ఎసురొచ్చి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది. మరో వైపు కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితి బాగోలేదననే ఆందోళన ఆయనలో రోజురోజుకూ తీవ్రమవుతోంది. భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్లాక గంగుల కుటుంబం వైఎస్సార్‌సీపీలో చేరడం, శిల్పా మోహన్‌రెడ్డి గుర్రుగా ఉండటం పట్ల ఏం చేయాలో తోచక చంద్రబాబు తల పట్టుకున్నారు. 

ఈ స్థితిలో జేసీ సోదరులతో వైరం పెంచు కోవడానికి బాబు ఏ మాత్రం ఇష్టపడలేదని సమాచారం. ఈ నేపథ్యం లో ఒక అబద్ధాన్ని పదిమార్లు పదే పదే చెప్పి.. అసలు విషయం మరుగున పడేలా చేసి, అబద్ధ మే అసలు నిజ మని జనాన్ని నమ్మించాలనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇందుకు క్యాబినెట్‌ సమావేశాన్నే వేది కగా చేసుకోవ డంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: