తమిళనాడులో రాజకీయ గందరగోళం ఇంకా సమసి పోయినట్లు కనిపించడం లేదు.  ఇప్పటికే శశికళ, పన్నీర్ సెల్వం మద్య జరిగిన యుద్దం ముగిసిందనుకున్న సమయంలో పన్నీరు అమ్మ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని నిరాహార దీక్ష చేయడంతో మళ్లీ తెరపై జయలలిత మరణానికి సంబంధించిన గందరగోళం రాజుకుంది.  మరోవైపు అపోలో ఆసుపత్రి వర్గం వర్గం ఇప్పటికే జయలలిత మృతికి సంబందిన అన్ని డిటైల్స్ ఇచ్చారని తమిళనాడు సీఎం పళని స్వామి తెలిపారు.  ఇక జయలలిత మేనకోడలు ఇప్పటికే ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై అనే కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పారు.  
Related image
ఈ ఫోరం ప్రారంభించడానికి ముందు కూడా చాలా మంది తనకు అడ్డంకులు సృష్టించారని దీపా జయకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. జయలలిత పోటీచేసే ఆర్కే నగర్ నుంచి దీపా జయకుమార్ పోటీ చేసి అమ్మ అసలు వారసురాలిగా నిరూపించుకోవాలని ఆమె శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12 న జరుగబోయే ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేయకూడదని వేధిస్తున్నారని దీపా జయకుమార్ సోమవారం ఆరోపించారు. ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని తాను ప్రకటించినప్పటి నుంచి వివిధ రకాలుగా తనను పరోక్షంగా వేధిస్తున్నారని చెప్పారు. \
Image result for deepa jayakumar new party
కనీసం తాను ఇంట్లో కూడా ఉండటం లేదని, తనకు వ్యతిరేకంగా పలువురు గూండాలు అక్కడికి వస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.  కాగా ఆర్కే నగర్ వాసులు కూడా చిన్నమ్మను పక్కన పెట్టి, దీపా జయకుమార్ కే తమ మద్దతు తెలుపుతున్నారు.  దీంతో తనపై అక్కసుతోనే తనను బెదిరిస్తున్నారని తనకు రక్షణ కావాలని అంటున్నారు దీప జయకుమార్. అసలు వారు ఎవరి వర్గానికి చెందిన వారో కూడా తెలియడం లేదన్నారు. ఈ ఉప  ఎన్నికల నుంచి తనని విరమింపజేయడానికి పలు కుట్రలు జరుగుతున్నట్టు చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: