తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలపై తలసరి రుణ భారం రూ. 40,149గా బడ్జెట్ ప్రసంగంలో ఈటల రాజేందర్ తేల్చారు. మొత్తం రాష్ట్రం అప్పు రూ. 1,40,523 కోట్ల రూపాయలని చెప్పిన ఆయన, 201718లో రూ. 26,400 కోట్లను రుణంగా తీసుకోనున్నామని తెలిపారు. మొత్తం రాష్ట్ర జీడీపీలో 18.51 శాతానికి అప్పులు పెరిగాయని అన్నారు. గత సంవత్సరం సేల్స్ టాక్స్ రూ. 42,074 కోట్లు కాగా, ఈ సంవత్సరం రూ. 37,439 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. 


Image result for telangana budget

* కేంద్ర ప్రభుత్వ రుణరూపంలో రూ.1000కోట్లు 
* రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 18.51శాతం 
* తలసరి అప్పు రూ.40,149కోట్లు 
* గతేడాది అమ్మకం పన్ను అంచనా రూ.42,074కోట్లు కాగా... వసూళ్లు 37,439కోట్లు మాత్రమే వసూలైంది. 
* గతేడాది ఎక్సైజ్‌ ద్వారా వచ్చిన ఆదాయం రూ.5,083కోట్లు. 
* ఈ ఏడాది ఎక్సైజ్‌ ఆదాయం అంచనా రూ.8,999కోట్లు 
* గతేడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం లక్ష్యం రూ.4,291కోట్లు కాగా.. రూ.4041కోట్లు మాత్రమే వచ్చింది. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం లక్ష్యం రూ.3వేల కోట్లకు తగ్గింపు. 
* ఈ ఏడాది వాహనాల పన్ను ఆదాయ లక్ష్యం రూ.3000కోట్లు 
* ఇతర రూపాల్లో సమకూర్చుకోనున్న ఆదాయం రూ.36,237కోట్లు

 


మహిళా శిశు సంక్షేమం కోసం 

 రూ. 1731 కోట్లు

బీసీ సంక్షేమం కోసం రూ. 5,070 కోట్లు

మైనార్టీ సంక్షేమం కోసం రూ. 1249 కోట్లు
ఆసరా ఫించన్ల కోసం రూ. 5,330 కోట్లు
బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు
ఫీజు రియింబర్స్ మెంట్ కోసం రూ. 1939 కోట్లు
చేనేత కార్మికుల కోసం రూ. 1200 కోట్లు
చివరి విడత రైతుల రుణమాఫీకి రూ. 4000 కోట్లు
ఇరిగేషన్ కు రూ. 26,652 కోట్లు
విద్యారంగ అభివృద్ధికి రూ. 12,705 కోట్లు
వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు
పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723 కోట్లు 



 


మరింత సమాచారం తెలుసుకోండి: