భారత దేశంలో ఈ మద్య ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి తన సత్తా చాటింది.  పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలో సాగిన ఎలక్షన్ స్టంట్ లో బీజేపీ తగిన ఫలితం దక్కింది.  ఇక గోవాలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించేందుకు ఇప్పటికే రక్షణ శాఖ మంత్రిగా ఉన్న పారికర్ రాజీనామా చేశారు.  ప్రస్తుతం ఆయన గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోవడంతో రక్షణ శాఖను కూడా  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రధాని మోదీ అప్పగించారు. అరుణ్ జైట్లకి తాత్కాలికంగా జైట్లీకే ర‌క్ష‌ణ శాఖ అద‌న‌పు బాధ్య‌త‌లు కేటాయించారు.


మంగ‌ళ‌వారం రక్ష‌ణ మంత్రిత్వ శాఖ కార్యాల‌యానికి వెళ్లి జైట్లీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప్ర‌స్తుత పార్లమెంట్ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత కేంద్ర కేబినెట్‌లో కీల‌క మార్పులు జ‌ర‌గ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే వార్త‌లు వ‌స్తున్నాయి. అప్ప‌టివ‌ర‌కు జైట్లీయే ర‌క్ష‌ణ శాఖ బాధ్య‌త‌లు చూసుకోనున్నారు.

Image result for MANOHAR PARRIKAR , GOA ,

ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2014, మే 26 నుంచి అదే ఏడాది నవంబర్ 9 వరకు రక్షణ మంత్రి బాధ్యతలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: