ఏపీ బడ్జెట్‌ 2017-18...


దేశానికే ఆదర్శంగా నిలిచేలా.. ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా రాజధాని నిర్మాణం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాజధానిని అనుసంధానిస్తూ.. ఈ ఏడాది రోడ్ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టడానికి కృషి చేస్తున్నామని యనమల తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3000 కి.మీ. రహదారులను నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. తదనుగుణంగా ప్రస్తుత బడ్జెట్‌లో రోడ్లు, భవనాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో రూ.4041 కోట్లను కేటాయించామని ఆయన తెలిపారు.


చంద్రబాబుదంతా అంకెల మాయంటున్న జగన్..


చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించినదంతా అంకెల మాయేనని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు చూసిన తర్వాత బడ్జెట్‌లో వీళ్లు చూపిస్తున్న లెక్కలు యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నారు. ఈ బడ్జెట్‌లో చంద్రబాబు నాయుడు 2016-17కు సంబంధించి 11.61 శాతం వృద్ధిరేటు నమోదు కాబోతోందని అన్నారు. 


ఆంధ్రాకు గుడ్ న్యూస్.. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బుధవారం రాత్రి 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడో టేబుల్‌ అంశంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశం చర్చకు రాగా.. మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇవ్వడంతో పాటు, పర్యావరణ అనుమతుల విషయంలో కూడా కేంద్రమే చొరవ తీసుకుంటుంది.


ఐటీ రంగంలో హైదరాబాద్‌ ముందంజ..


తెలంగాణ రాష్ర్టానికి ఐటీఐఆర్ వచ్చినా, రాకపోయినా ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శాసనమండలిలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలో అగ్ర భాగాన నిలవబోతుందన్నారు. ఐటీఐఆర్‌ పై ఇప్పటికే ఐదు సార్లు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి చర్చించానని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. కానీ ఇంత వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.


కేంద్ర హోంమంత్రితో గవర్నర్ నరసింహన్ భేటీ


కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన రెండు రాష్ట్రాలలో పరిస్థితులపై హోంమంత్రికి వివరించారు. రెండు రాష్ట్రాల బడ్జెట్ లూ బాగున్నాయని గవర్నర్ చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు గవర్నర్ హోంమంత్రికి తెలిపారు. కమిటీ పనితీరు బాగుందని, త్వరలోనే సమస్యలు పరిష్కారమౌతాయని వివరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: