అమరావతిలో కొత్తగా కట్టుకున్న అసెంబ్లీలోనూ పాత తరహా రాజకీయాలే నడుస్తున్నాయి. గత సమావేశాలకంటే ఏమాత్రం మెరుగ్గా కాకుండా అంతకంటే అద్వాన్నంగా అసెంబ్లీ నడుస్తుండటం విశేషం. అసెంబ్లీలోనే ఏకంగా సీఎం వంటి వాళ్లు మాట్లాడుతున్నా విపక్ష నేతలు నిత్యం రన్నింగ్ కామెంటరీ చేయడం.. సీఎం కూడా సహనం కోల్పోయి విపక్షాలను అలాగా జనం అని కామెంట్ చేసే స్థాయికి దిగజారాయి. 



ఇక మంగళవారం అవి మరింతగా దిగజారాయి. అసెంబ్లీలో తీట్టుకున్నది చాలదన్నట్టు అసెంబ్లీ మీడియా పాయింట్లోనూ లేడీ ఎమ్మెల్యేలు సిగపట్టు పట్టారు. అది అసెంబ్లీ అని.. ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నారని.. మన పరువు పోతుందని ఏమాత్రం స్పృహ లేకుండా ప్రవర్తించారు. మీడియా పాయింట్లో మాట్లాడుకునేందుకు ఒకరికొనకరు తోసుకున్నారు. 



ఒకరుపై ఒకరు ఆధిపత్యం చూపాలి. మా పంతం నెగ్గాలి.. మీడియాలో మా కవరేజ్ బాగా రావాలి..పొలిటికల్ మైలేజ్ కావాలి.. ఇదే నాయకుల అజెండాగా మారిపోయింది. అంతకుమించి ప్రజా సమస్యలపట్ల చిత్తశుద్ధి అటు విపక్షంలోనూ.. ఇటు అధికారపక్షంలోనూ కనిపించడం లేదు. చివరకు అసెంబ్లీలో టాయిలెట్ కు పోవడం కూడా ఓ అంశంగా మారిపోయి జగన్- యనమల సంవాదం చేసుకునే స్థాయికి చేరుకుంది. జనం ఛీ ఛీ ఇదేం అసెంబ్లీ అనుకునే స్థాయికి చేరింది.



మరింత సమాచారం తెలుసుకోండి: