స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒకప్పుడు టీడీపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే హోంమంత్రిగా పనిచేసిన సత్తా ఉన్నవాడు. కానీ ఆయన్ను చంద్రబాబు ఎందుకనో తొక్కేస్తున్నారన్న భావన ఉంది. పదేళ్ల తర్వాత పార్టీ గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవితో సరిపెట్టారు. వాస్తవానికి కోడెలకు ఈ స్పీకర్ పదవి అంత ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక ఓకే చెప్పారు. 


ఇప్పుడు చంద్రబాబును కాదని ఏం చేసే పరిస్థితి లేదు కాబట్టి.. ఉన్నంతలో సర్దుకుపోతూ సొంత నియోజకవర్గానికి సాధ్యమైనంత ఎక్కువ పని చేస్తూ అలా కాలం గడిపేస్తున్నారు కోడెల. అలాంటి కోడెల శివప్రసాదరావుపై చంద్రబాబు టీమ్ గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీలో కోడెల విపక్షానికి ఎక్కు వ ప్రాధాన్యం ఇస్తున్నారని అధికార పార్టీ నేతల్లో ఓ భావన ఏర్పడింది. 


బుధవారం అసెంబ్లీలో జరిగిన కొన్ని ఘటనలు ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇన్ పుట్ సబ్సిడీ, రైతు ఆత్మహత్యలపై మాట్లాడే సమయంలో జగన్ పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నించడం కొన్నిసార్లు స్పీకర్ అనుమతించడంతో అధికార పార్టీ కోపం నషాళానికి అంటింది. సాధారణంగా అధికారపార్టీకే అనుకూలంగా ఉంటుంటారు. అలాంటి స్పీకర్ పై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు. అధ్యక్షా విపక్ష నాయకుడు పదే పదే మాట్లాడటం.. అందుకు మీరు అనుమతించడం బాగా లేదు అధ్యక్షా.. అన్నారు. 

kalva srinivasulu కోసం చిత్ర ఫలితం

దీంతో కోడెలకు చిర్రెత్తుకొచ్చింది.. మీరు చైర్ ను ప్రశ్నించలేరు.. ప్రశ్నించకూడదు అని కఠినంగానే మూడు, నాలుగు సార్లు అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడిన సమయంలోనూ మీరు విపక్షానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని మరోసారి గుర్తు చేశారు. మొత్తానికి కోడెల పట్ల చంద్రబాబు టీమ్ చాలా కోపంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది ఎటు దారి తీస్తుందో మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: