నారా బ్రహ్మణి.. ఓ ముఖ్యమంత్రి కోడలు.. ఓ స్టార్ హీరో కూతురు.. ఒకనాడు ముఖ్యమంత్రికి మనవరాలు.. ఇప్పుడు ఓ యువ నాయకుడి భార్య.. అంతేనా.. ఓ కంపెనీని నడిపిస్తున్న యువ పారిశ్రామిక వేత్త. ఆమె ఇటీవల ఓ పత్రికతో తన అనుభవాలు పంచుకున్నారు. పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. 

Image result for NARA BRAHMANI BALAKRISHNA
వాటిలో తండ్రి గురించి చెప్పిన ఓ జ్ఞాపకం భలే సరదాగా ఉంది. బ్రహ్మణి చిన్నప్పుడు బాలకృష్ణతో కలసి జాగింగ్ కు వెళ్లేదట. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కుకు జాగింగ్ కోసం వెళ్లేవారట. కానీ అప్పటికే ఆ పార్కు తెరిచేవారు కాదట. అందుకే బాలకృష్ణ బ్రహ్మణిని భుజంపై ఎక్కించుకుని గోడ దూకించేవారట.

Image result for NARA BRAHMANI BALAKRISHNA
ఆ తర్వాత తాను కూడా గోడ దూకి పార్కులోకి వెళ్లేవారట. వారిద్దరి జాగింగ్ పూర్తయ్యేసరికి పార్క్ గేట్లు తెరిచేవారట. భలే తమాషాగా ఉంది కదూ.. ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో బ్రహ్మణి నెమరేసుకున్నారు. ఔను కదా.. భార్యను సరిగ్గా చూసుకోని భర్త ఉంటాడేమో కానీ.. కూతుర్ని యువరాణిలూ చూసుకోని తండ్రి మాత్రం ఉండడు.. కాదంటారా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: