2007లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఆయేషాపై అత్యాచారం, ఆపై హత్య. ఈ కేసుపై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా విద్యార్థిని ఆయేషా కేసులో నిందితుడుగా వున్న సత్యంబాబును నిర్దోషి అంటూ తేల్చుతూ సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు నిందితుడిగా చెబుతున్న సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. ఆధారాలు లేకుండా ఎనిమిదేళ్లుగా సత్యంబాబును జైలులో ఉంచారని పోలీసులను హైకోర్టు మందలించింది.
Related image
అప్పటి పోలీసు అధికారులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. యేషా హత్య అనంతరం విజయవాడలో సత్యంబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని అతడే నిందితుడని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన సెషన్స్ కోర్టు అప్పట్లో అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఐతే ఆయేషా తల్లి మాత్రం సత్యంబాబు నిర్దోషి అనీ, అసలు దోషులను పట్టుకోకుండా అమాయకుడిని తెచ్చి పోలీసులు ఇరికించారని ఆమె ఆరోపించారు.  తాజాగా ఈ కేసులో హైకోర్టు తీర్పు పోలీసులకు షాకిచ్చింది. 


న్యాయం గెలిచింది : 
అయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై అయేషా తల్లి శంషాద్ బేగం హర్షం వ్యక్తం చేసింది. చివరకు న్యాయమే గెలిచిందని, న్యాయ వ్యవస్థ మంచి తీర్పు నిచ్చిందని ఆమె పేర్కొంది.  అంతే కాదు సత్యంబాబుకు పోలీసులు కోటి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: