చాలా కాలం పాటు విప్లవ పార్టీలో కీలక సభ్యుడిగా కొనసాగి, తన విప్లవ గీతాలతో ప్రజల్లో చైతన్యం రేకెత్తించిన విప్లవ గేయ రచయిత గద్దర్ మనందరికీ తెలిసిన వ్యక్తే. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయకపోయినా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన కీలక వ్యక్తుల్లో ఆయన ఒకరు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది గద్దర్ స్వయానా రచించి పాడిన 'పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా' పాట. ఉద్యమసమయంలో ఈ పాట తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయనగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.



అయితే ఇంతకాలం మావోయిస్టు పార్టీలో కొనసాగిన గద్దర్ ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు ప్రకటించారు. దీనికి కారణాలు సైతం లేకపోలేదు. ప్రస్థుతం మావోయిస్టు పార్టీ ప్రజలో ప్రాబల్యాన్ని కొల్పవడమే. అయితే పార్టీ మారి మళ్లీ గద్దర్ రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టిస్తారా.? అంటే చెప్పలేం అనే సమాధానమే విస్పష్టం. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రజాగాయకుడిగా పేరొందిన గద్దర్‌ను పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున రంగంలోకి దింపుతారనే ప్రచారం విస్తృతంగా సాగింది. గద్దర్ అంటే తెలంగాణలో తెలియని వారుండరంటే అతియోశక్తి కాదు.


గద్దర్‌తో ముందుకు

ప్రజా ఉద్యమాలతో ప్రజల్లో ఉంటున్న గద్దర్‌ను తెలంగాణలో జనసేన పార్టీ ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించాలని పవన్ చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గద్దర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, గద్దర్.. జనసేన పార్టీ తరపున తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారా? అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: